ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్యా యత్నం | - | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్యా యత్నం

Apr 16 2026 10:12 AM | Updated on Apr 16 2026 10:12 AM

పోరుమామిళ్ల: మండలంలోని సిద్దవరం పంచాయతీ చిన్నాయపల్లెకు చెందిన మేరుగ బాబు బుధవారం వచ్చిన ఇంటర్‌ ఫలితాల్లో ఫెయిల్‌ అయ్యానని మానసిక వేదనతో పురుగుల మందు తాగి ఆత్యహత్యాయత్నం చేశాడు. ఈ సంఘటన మండలంలో కలకలం రేపింది. ఎస్‌ఐ హనుమంతు కథనం మేరకు బాబు ఫెయిల్‌ అయ్యాననే బాధతో పురుగుల మందు తాగడంతో కుటుంబసభ్యులు వెంటనే పోరుమామిళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారన్నారు. ఆసుపత్రిలో చికిత్స చేసిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉండటంతో కడప రిమ్స్‌కు తీసుకెళ్లాలని సూచించారు. అయితే తల్లిదండ్రులు, బంధువులు కడప లో హోలిస్టిక్‌ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారని యస్‌ఐ తెలిపారు.

జాతీయస్థాయిలో ట్రిపుల్‌ ఐటీ విద్యార్థుల ప్రతిభ

వేంపల్లె : భారత ప్రభుత్వం నిర్వహించిన ప్రతిష్టాత్మమైన మై భారత్‌ బడ్జెట్‌ క్వెస్ట్‌ 2026 పోటీలలో ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులు జాతీయస్థాయిలో విశేష ప్రతిభ కనబరిచినట్లు డైరెక్టర్‌ ఏవీఎస్‌ కుమారస్వామి గుప్తా పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు పాల్గొన్న ఈ పోటీలలో ఆర్కే వ్యాలీ ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులు తమ మేథస్సు, విశ్లేషణ, సామర్థ్యం బడ్జెట్‌ లోతైన అవగాహనతో ప్రత్యేక గుర్తింపు పొందడం గర్వకారణమన్నారు. ఇటీవల విజయవాడలో నిర్వహించిన ఫైనల్‌ రౌండ్‌ పోటీలలో తమ కళాశాల విద్యార్థులు ఉన్నత స్థాయి సంభాషణలో చురుకుగా పాల్గొన్నారు. ఈ పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను డైరెక్టర్‌తోపాటు పరిపాలన అధికారి రవికుమార్‌, అకడమిక్‌ డీన్‌ రమేష్‌ కై లాస్‌, డాక్టర్‌ కోనప్ప అధ్యాపకులు హర్షం వ్యక్తం చేసి అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement