వేగంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో చర్మంలోని నీటి శాతం పూర్తిగా ఆవిరైపోతుంది. ఎండలు విపరీతంగా పెరగడంతో చెమట ద్వారా సోడియం లవణాలు ఎక్కువగా వెళ్లిపోతాయి. దీంతో వడదెబ్బ సొకే అవకాశం ఉంటుంది. దీంతో జ్వరం , మగతగా కమ్మటం, వాంతులు రావడం జరుగుతుంది. లవణాల శాతం ఉధృతంగా తగ్గితే కోమాలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉంది. బయటకు వెళ్లేవారు ఉప్పు బాగా వేసుకుని మజ్జిగ తీసుకోవాలి. బయట తిరిగే ప్రతి ఒక్కరూ రోజుకు నాలుగు నుంచి ఆరు లీటర్ల నీరు తాగుతూ ఉండాలి.
– డాక్టర్ మహబూబ్ అలీ, ఎండీ(ఫిజిషియన్‌అండ్ షుగర్ స్పెషలిస్టు), కడప


