జిల్లాలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించాలి. ఎండ తీవ్రత పెరగక ముందే ఉదయం 10 గంటలలోపు పనులు ముగించుకుని ఇళ్లకు చేరుకోవాలి. వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు మరింత జాగ్రత్తలు పాటించాలి. పండ్ల జ్యూసులు, జావ, నీటిశాతం ఎక్కువగా ఉన్న పండ్లను తీసుకోవడం మంచింది. ఏవైనా అనారోగ్య సమస్యలు తలెత్తితే ప్రభుత్వ ఆసుపత్రుల్లో లభించే ఉచిత వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలి.
–డాక్టర్ రవిబాబు, ఇంచార్జు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి


