● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
పి.రవీంద్రనాథ్‌రెడ్డి
● ఘనంగా అంబేడ్కర్ జయంతి
కడప కార్పొరేషన్ : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి, డిప్యూటీ సీఎం అంజద్‌బాషా విమర్శించారు. మంగళవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 135వ జయంతి సందర్భంగా ఆ పార్టీ ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు సింగమాల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండు వద్దనున్న అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ సీఈసీ సభ్యులు కె.సురేష్ బాబు, ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డితో కలిసి అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో దళితులు, అణగారిన వర్గాలపై దాడులు, దౌర్జన్యాలు, అరాచకాలు అధికమయ్యాయన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం మేల్కొనాలని, అంబేడ్కర్ ఆశయాలను కొనసాగించాలని కోరారు.
విశ్వనాయకుడు
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ ఆంబేడ్కర్ ఒక కులానికి నాయకుడు కాదని, ఆయన(యూనివర్సల్ లీడర్) విశ్వనాయకుడని మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా కొనియాడారు. దేశంలో ఎన్ని కులాలు, మతాలు, వర్గాలు ఉన్నా ప్రజలంతా కలిసి మెలసి ఉన్నారంటే అది అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం గొప్పతనమేనన్నారు. అంబేడ్కర్ రాజ్యాంగానికి బదులు లోకేష్ రచించిన రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు. అనంతరం వైఎస్సార్‌సీపీ ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు సింగమాల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పార్టీ జిల్లా కార్యాలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో వైఎస్సార్‌సీపీ ఎస్‌ఈసీ సభ్యులు యానాదయ్య, జిల్లా అధికార ప్రతినిధి పి.జయచంద్రారెడ్డి, డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు కిశోర్ బూసిపాటి, దాసరి శివప్రసాద్, బంగారు నాగయ్య, సీహెచ్ వినోద్ కుమార్, రామ్మోహన్‌రెడ్డి, బి.వేణుగోపాల్ నాయక్, త్యాగరాజు, కంచుపాటి బాబు, సింధేరవి, బసవరాజు, పవర్ అల్తాఫ్, జాషువా, నాగరాజు, కుమార్, ఆర్.చెన్నయ్య, కె.బాబు, పి.సంపత్, శ్రీరంజన్‌రెడ్డి, జి.మోహన్‌రెడ్డి, తోటక్రిష్ణ, డాక్టర్ పెంచలయ్య, పస్తం అంజి, టీపీ వెంకట సుబ్బమ్మ, రత్నకుమారి, మరియలు, తులశమ్మ, మల్లీశ్వరి తదితరులు పాల్గొన్నారు.


