కడప అర్బన్ : భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి వేడుకలు మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా జరిగాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చిత్రపటానికి ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశానికి అంబేడ్కర్ చేసిన సేవలను కొనియాడారు. అంబేడ్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని విధుల్లో పునరంకితం అవుదామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (ఏఆర్) బి.రమణయ్య, ఆర్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


