కడప కోటిరెడ్డిసర్కిల్ : కడప–తిరుపతి మధ్య తి రుగుతున్న ఏసీ ఎలక్ట్రికల్ బస్సును నడిపేందుకు అర్హులైన డ్రైవర్ల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తిరుపతి ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు తె లియజేశారు. ఆసక్తి, అర్హులైన వారు తమ ఆధా ర్, హెవీ డ్రైవింగ్ లైసెన్స్ (18 నెలలు పూర్తయి ఉండాలి), ఆర్టీవో క్లియరెన్స్, 8వ తరగతి ఉత్తీర్ణులైన సర్టిఫికెట్, మూడు పాస్‌పోర్టు సైజ్ ఫో టోలతో తిరుపతిలోని అలిపిరి డిపోకు రావాలని తెలిపారు. ఇతర వివరాలకు 73828 74600, 99598 53427 నంబర్లలో సంప్రదించాలన్నారు.
19న నెలనెలా సీమ సాహిత్యం
కడప ఎడ్యుకేషన్: యోగి వేమన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని సీపీ బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం నిర్వహిస్తున్న నెల నెలా సీమ సాహిత్యం కార్యక్రమంలో భాగంగా 154వ సదస్సును ఆదివారం ఉదయం 10 గంటలకు నిర్వహించానున్నారు. ఈ విషయాన్ని సీపీ బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం సంచాలకులు ఆచార్య జి.పార్వతి పేర్కొన్నారు. ఈ సదస్సులో ‘గాడేపల్లి వీరరాఘవ శాస్త్రి జీవితం – సాహిత్యం’అనే అంశంపై బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం సహాయ పరిశోధకులు డా. భూతపురి గోపాలకృష్ణ శాస్త్రి ప్రసంగిస్తారని తెలిపారు.
బాధితులకు
న్యాయం చేయాలి
– జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్
కడప అర్బన్: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ కార్యక్రమం జరిగింది. జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ పాల్గొని, జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి వివిధ సమస్యలపై అర్జీలు స్వీకరించారు. మొత్తం 152 ఫిర్యాదులు(పీజీఆర్‌ఎస్)కు వచ్చాయి. ఈ సందర్భంగా ఎస్పీ అధికారులతో ఫోన్‌లో మాట్లాడుతూ చట్టపరమైన పరిమితుల్లో నిర్ణీత గడువులోపు సమస్యలు పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. బాధితులకు న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ డీఎస్సీ ఎన్.సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
15న హాజరు కావాలి
కడప ఎడ్యుకేషన్: కడపజిల్లాలో నూతన డీఎస్సీలో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులు15వ తేదీ తిరుపతిలో జరిగే కార్యక్రమానికి తప్పకుండా హాజరుకావాలని డీఈఓ షేక్ షంషుద్దీన్ తెలిపారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ ఏప్రిల్ 15న తిరుపతి గొల్లవనిగుంట క్రికెట్ స్టేడియాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. కావున ఆరోజు ఉదయం 9 గంటలకు తిరుపతి డీఎస్‌డీఓ, డీఏఓ ముందు హాజరు కావాలని డీఈఓ తెలిపారు. ఆరోజున ఆన్‌డ్యూటీగా పరిగణించనున్నట్లు డీఈఓ తెలిపారు.
రక్షణ కోరిన ప్రేమ జంట
కడప రూరల్: ప్రేమ వివాహం చేసుకున్నాం. తమకు రక్షణ కల్పించాలని ఆ జంట వేడుకుంది. సోమవారం కడపలోని వైఎస్‌ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో చాపాడు మండలం లక్ష్మీ పేటకు చెందిన స్రవంతి, అదే మండలం పాటిమీద పల్లెకు చెందిన సుమంత్ మాట్లాడుతూ కొన్నేళ్లుగా ఉన్న స్నేహం ప్రేమగా మారిందన్నారు. తమ ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడంతో కడపకు సమీపంలో ని ఒక గుడిలో వివాహం చేసుకున్నామని పేర్కొన్నారు. తమకు రక్షణ కల్పించాలని కోరారు. ఈ విషయంపై జిల్లా ఎస్పీని కలవనున్నట్లు తెలిపారు.
రేపటి నుంచి
ఇజితిమా ధార్మిక సభలు
కలికిరి: కలికిరి సమీపం మదనపల్లి–తిరుపతి జాతీయ రహదారి టేకలకోన వద్ద ఈ నెల 15, 16 తేదీల్లో రాయచోటి జిలేకా మైదానీ ఇజితిమా ధార్మిక కార్యక్రమం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ సభలకు సంబంధించి అన్నమయ్య జిల్లాతో పాటు పరిసర జిల్లాల్లో జమాత్ సభ్యులు సుమారు రెండు మాసాలుగా ప్రచారాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ముస్లింలు హాజరు కానున్నారు.దీంతో ఏపీఐఐసీ స్థలంలో మైదానాన్ని చదును చేసి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు లక్ష మందికి పైగా ముస్లిం సోదరులు హాజరవ్వనున్నట్లు సమాచారం. ధార్మిక సభలకు ఇస్లాం బోధకులు, మత గురువులు హాజరై ధార్మిక ఉపన్యాసాలు చేయనున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.


