పలువురి సీఐల బదిలీ | - | Sakshi
Sakshi News home page

పలువురి సీఐల బదిలీ

Apr 14 2026 8:04 AM | Updated on Apr 14 2026 8:04 AM

కడప అర్బన్‌: కర్నూల్‌ రేంజ్‌ డీఐజీ డాక్టర్‌ కోయ ప్రవీణ్‌ ఆదేశాల మేరకు జిల్లాకు చెందిన పలువురు సీఐలు బదిలీ అయ్యారు. మంత్రాలయం సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తున్న పి. రామాంజులును పులివెందుల ట్రాఫిక్‌ సీఐగా బదిలీ చేశారు. పులివెందుల ట్రాఫిక్‌ సీఐగా పని చేస్తున్న కె. శాంతి లాల్‌ ను పులివెందుల రూరల్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌గా, పులివెందుల రూరల్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న వి. సీతారామరెడ్డిని నంద్యాల టీటీసీకి బదిలీ చేశారు. నంద్యాల డీటీసీలో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న డి. హాజీవలీని వైఎస్సార్‌ కడప జిల్లా సీసీఎస్‌– టు ఇన్‌స్పెక్టర్‌గా, అనంతపురం వీఆర్‌లో పనిచేస్తున్న ఎస్‌.కె చాంద్‌బాషాను వైఎస్సార్‌ కడప జిల్లా చెన్నూరు అప్‌ గ్రేడ్‌ పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌గా, చెన్నూరులో ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తున్న ఎం. కృష్ణారెడ్డిని అన్నమయ్య జిల్లా ఎస్సీ ఎస్టీ సెల్‌కు, కడప సీసీఎస్‌ టు ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న వి. శ్రీహరిని ఒంటిమిట్ట సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌గా, బద్వేలు రూరల్‌ సీఐ గా పని చేస్తున్న ఎన్‌.కృష్ణయ్యను టి. సుండుపల్లి సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌గా, టి.సుండుపల్లి నుంచి ఏపీ మస్తాన్‌ ను బద్వేలు రూరల్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌గా బదిలీ చేశారు. వీరు త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు.

బాధ్యతల స్వీకరణ

వైఎస్సార్‌ కడప జిల్లా కడపలోని తాలూకా సీఐగా నరసింహరాజు సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఈయన ప్రస్తుతం ఒంటిమిట్ట సీఐగా పని చేస్తూ కడప తాలూకాకు బదిలీ అయ్యారు. కడప తాలూకా పరిధిలో అలంఖాన్‌ పల్లెలో ఈనెల 6వ తేదీ పెద్ద దస్తగిరి అనే వ్యక్తిని రిమ్స్‌లో దారుణంగా హత్య చేసిన సంఘటనలో బాధితుల ఆరోపణ మేరకు కడప తాలూకా సీఐగా పనిచేసిన రెడ్డప్పను వీఆర్‌ కు బదిలీ చేశారు. ఈ క్రమంలో కడప తాలూకా సీఐగా నరసింహరాజు బాధ్యతలు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement