ఎయిడ్స్‌ నియంత్రణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు | - | Sakshi
Sakshi News home page

ఎయిడ్స్‌ నియంత్రణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

Apr 14 2026 8:04 AM | Updated on Apr 14 2026 8:04 AM

మదనపల్లె టౌన్‌: ఎయిడ్స్‌ నియంత్రణ కార్యక్రమాల్లో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని అడిషనల్‌ డిఎంహెచ్‌ఓ డాక్టర్‌ రాధిక హెచ్చరించారు. సోమవారం మదనపల్లె అర్బన్‌హెల్త్‌ సెంటర్‌ లో ఐసీటీసి, ల్యాబ్‌ టెక్నీషియన్లతో పాటు ఐసీటీసీ కౌన్సిలర్లు, ఏఆర్‌టీ డాక్టర్‌ తో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన అడిషనల్‌ డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ.. మిషన్‌ ఎయిడ్స్‌ సురక్షా కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఎయిడ్స్‌ నియంత్రణ కార్యక్రమాలను సమర్థ వంతంగా అమలు చేయాలని సూచించారు. ముఖ్యంగా పరీక్షలు, కౌన్సెలింగ్‌, మందుల సరఫరాలో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. క్లస్టర్‌ ఇన్‌చార్జి భాస్కర్‌ మాట్లాడుతూ ప్రైవేట్‌ ఆస్పత్రులలో కూడా ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ రోగులకు సేవలు అందించాలని కోరారు. ఐసీటీసీ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement