మా గ్రామ సర్వే నంబరు 178/2బీలో 1.83 ఎకరాల శ్మశాన స్థలాన్ని యల్లటూరు అన్వర్‌బాష, యల్లటూరు కమాల్‌బీ ఆక్రమించి మామిడి చెట్లు నాటారు. అధికారులకు ఫిర్యాదుచేయగా, సర్వే నిర్వహించి ఆ భూమి శ్మశాన వాటికదేనని నిర్ధారించారు. మామిడి చెట్లు తొలగించి బోర్డు ఏర్పాటు చేయాలని తాము తహసీల్దార్‌ను కోరగా, నిధులు లేవంటూ తప్పించుకుంటున్నారు. గతంలోనూ పలుమార్లు రెవెన్యూ క్లినిక్‌లో ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. – చింతకుంట శివారెడ్డి, పొన్నోలు కొత్తపల్లె, సిద్దవటం మండలం


