కడప అగ్రికల్చర్: రైతులు యూరియాను కేవలం వ్యవసాయ అవసరాల కోసమే వినియోగించాలని జిల్లా వ్యవసాయ అధికారి మట్టా సుబ్రమణేశ్వరరావు పేర్కొన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ జిల్లాలో యూరియా దుర్వినియోగం జరగకుండా కట్టదిట్టమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు చెప్పారు. యూరియా వ్యవసాయ అవసరాలకు కాకుండా పరిశ్రమల్లో ఉపయోగిస్తున్నట్లు గుర్తించిన సందర్భంలో ఎరువుల నియంత్రణ ఆదేశాలు 1985 ప్రకారం క్లాజ్ 25 నిబంధనల మేరకు కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపా రు. జిల్లాలో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా టాస్క్‌ఫోర్స్ కమిటీ త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. కమిటీ సభ్యు లు నిరంతరం యూరియా అమ్మకాలపై పర్యవేక్షణ చేస్తూ అక్రమ వినియోగాన్ని అరికట్టేందుకు చర్యలు చేపడతారని తెలిపారు. అలాగే వచ్చే ఖరీఫ్ సీజన్ పంటల దృష్ట్యా సమగ్ర కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేస్తామన్నారు. రైతుల అవసరాలను ముందుగానే అంచనా వేసి తగిన మోతాదులో ఎరువులను సమకూర్చేందుకు చర్యలు చేపడుతున్నామని జేడీఏ పేర్కొన్నారు.
జిల్లా వ్యవసాయ అధికారి
మట్టా సుబ్రమణేశ్వరరావు


