పూలే గొప్ప సామాజిక తత్వవేత్త | - | Sakshi
Sakshi News home page

పూలే గొప్ప సామాజిక తత్వవేత్త

Apr 12 2026 3:06 AM | Updated on Apr 12 2026 3:06 AM

కడప కార్పొరేషన్‌ : మహాత్మా జ్యోతిరావు పూలే గొప్ప సామాజిక తత్వవేత్త, ఉద్యమకారుడు అని మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా అన్నారు. శనివారం పూలే 200వ జయంతి సందర్భంగా పాతబస్టాండులోని ఆయన విగ్రహానికి వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యులు కె.సురేష్‌ బాబు, ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి, మాజీ మేయర్‌ పాకా సురేష్‌తో కలిసి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అంజద్‌బాషా మాట్లాడుతూ దివంగత వైఎస్సార్‌, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేదల ఆశయాల సాధన కోసం కృషి చేశారని తెలిపారు. వైఎస్‌ జగన్‌ తన ప్రభుత్వంలో బీసీలకు పెద్దపీట వేశారని తెలిపారు. బీసీలు తమ పేటెంట్‌ అని చెప్పుకునే టీడీపీ వారిని ఓటు బ్యాంకుగా మాత్రమే ఉపయోగించుకుందన్నారు. పాతబస్టాండులో రూ.1.50 కోట్లు ఖర్చు చేసి తాము పూలే విగ్రహం పెట్టి, సర్కిల్‌ ఆధునీకరిస్తే కూటమి ప్రభుత్వం దానికి శంకుస్థాపన కూడా చేయలేదన్నారు. కడప ఎమ్మెల్యే మాధవి పూలే విగ్రహానికి దండ కూడా వేయలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్‌ నిత్యానందరెడ్డి, వైఎస్సార్‌సీపీ బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు ఎన్‌.శివరామ్‌, రాష్ట్ర కార్యదర్శి కె.శివయాదవ్‌, వైఎస్సార్‌సీపీ నాయకులు పి.జయచంద్రారెడ్డి, బసవరాజు, తోటక్రిష్ణ, సీహెచ్‌ వినోద్‌, ఎస్‌.వెంకటేశ్వర్లు, త్యాగరాజు, బీహెచ్‌ ఇలియాస్‌, రాయల్‌బాబు, అక్బర్‌ అలీ, సుబ్బరాయుడు, నారాయణమ్మ, రత్నకుమారి, సిందేరవి, గంగరాజు, మల్లికార్జున, కిరణ్‌, జాషువా, రహీం, పస్తం అంజి, గోపాలక్రిష్ణ, కంచుపాటి బాబు, అబ్దుల్‌ సుభాన్‌, చైతల్య, పి.సంపత్‌, షఫీవుల్లా తదితరులు పాల్గొన్నారు.

మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా

Advertisement
 
Advertisement
Advertisement