బ్యాంకు ఉద్యోగి ఆత్మహత్య
చింతకొమ్మదిన్నె : మండలంలోని విశ్వనాథపురం సమీపంలోగల జేవీ నగర్‌లో నివాసం ఉండే విమల్ రాజ్ (37) గురువారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు చింతకొమ్మదిన్నె పోలీసులు తెలిపారు. మృతుడు కడపలోని యూనియన్ బ్యాంకు రీజినల్ ఆఫీస్‌లో అసిస్టెంట్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్నారు. గురువారం విధులకు వెళ్లలేదు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు బెడురూంలో ఉన్నాడు. బయటకు రాకపోవడంతో ఇంట్లోని వారు సాయంత్రం బలవంతంగా తలుపులు తెరిచి చూడగా పడకగదిలోని ఉరికి వేలాడుతూ కనిపించాడు. కుటుంబ సమస్యలతో మూడీగా వుండే వాడని, ఈ కారణంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక సమాచారం. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. ఈ సంఘటనపై చింతకొమ్మదిన్నె పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


