రెండు బైకులు ఢీ.. ఓ యువకుడు మృతి
– ఇరువురికి తీవ్రగాయాలు, ఒకరి పరిస్థితి విషమం
పోరుమామిళ్ల : పట్టణానికి కిలోమీటర్ దూరంలో ఈదుళ్లపల్లె సమీపంలో పెట్రోల్ బంకు వద్ద మంగళవారం సాయంత్రం నాలుగున్నర గంటల ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కలసపాడు మండలం కొండపేట ఎస్సీ కాలనీకి చెందిన తప్పెట రఘు (21) మృతి చెందాడు. రెండు బైకులు ఎదురెదురుగా రావడంతో ఢీ కొని ప్రమాదం చోటు చేసుకుంది. మృతుడు రఘు పెయింటర్ పనికి వచ్చి అక్కడ ఉన్న స్కూటీని తీసుకుపోతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. ప్రమాద ప్రాంతానికి వచ్చిన ఓ వ్యక్తి మృతున్ని గుర్తించి, తన వద్దకు పెయింటింగ్ పనికి వచ్చి, అక్కడ పెట్టిన తన స్కూటీని దొంగలించుకు వచ్చాడని చెప్పాడు. కాశినాయన మండలం బాలాయపల్లెకు చెందిన ముగ్గురు ఒకే బైక్‌పై పోరుమామిళ్లకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బైకులో ఉన్న ఇద్దరు తీవ్రంగా గాయపడగా 108లో పోరుమామిళ్ల ఆసుపత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో దుకాణం దగ్ధం
బద్వేల్ అర్బన్ : మున్సిపాలిటీ పరిధిలోని గాంధీనగర్ లో మంగళవారం తెల్లవారుజామున విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఓ కిరాణా దుకాణంలో మంటలు చెలరేగి దుకాణం పూర్తిగా దగ్ధమైంది. గాంధీనగర్‌కు చెందిన బైసాని సుభద్రమ్మ అనే మహిళ కొన్నేళ్లుగా తన ఇంటి ఎదుట చిన్నపాటి దుకాణంలో కిరాణా షాపు నిర్వహిస్తోంది. రోజు మాదిరే మంగళవారం రాత్రి దుకాణం మూసి వేసి ఇంటికి వెళ్లింది. అయితే అర్ధరాత్రి సమయంలో దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వడంతో ఫైర్ ఆఫీసర్ చంద్రుడు ఆధ్వర్యంలో సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో దుకాణంలో ఉన్నటువంటి నిత్యావసర సరుకులతో పాటు కొంత నగదు పూర్తిగా దగ్ధమైంది. సుమారు రూ.1.50 లక్షలు నష్టం వాటిల్లినట్లు సుభద్రమ్మ తెలిపారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు ఫైర్ ఆఫీసర్ ధ్రువీకరించారు. అలాగే అర్బన్ సీఐ లింగప్ప ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
రెండు బైకులు ఢీ.. ఓ యువకుడు మృతి


