ప్రైవేటు వాహనాల తనిఖీ
రాజంపేట : కడప–రేణిగుంట హైవేపై మంగళవారం ప్రైవేటు వాహనాలను రవాణాశాఖ, ఆర్టీసీ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఆర్టీసీ తరపున రాజంపేట డిపో మేనేజరు కలువాయి గోవర్ధన్‌రెడ్డి, రవాణాశాఖ తరపున ఎంవీఐ వినోద్‌కుమార్‌లు తమ సిబ్బందితో 43 ప్రైవేటు వాహనాలను తనిఖీలు చేశారు. రికార్డులు సరిగ్గాలేని 12 వాహన దారులకు జరిమానా విధించారు. ఒక వాహనాన్ని సీజ్ చేశారు. రూ.1,30,000 జరిమానా విధించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రయాణికుల నుంచి అధికచార్జీలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలపై ప్రయాణికులను విచారించామన్నారు.
పల్లవోలుకు చెందిన వ్యక్తిపై పీడీ యాక్ట్
– కడప సెంట్రల్ జైలుకు తరలింపు
చాపాడు : మండలంలోని పల్లవోలు గ్రామానికి చెందిన దుంపల వినోద్ కుమార్ అలియాస్ రంగారావుపై పీడీ యాక్ట్ నమోదు చేసి కడప సెంట్రల్ జైలుకు తరలించినట్లు మంగళవారం రూరల్ సీఐ శివశంకర్ తెలిపారు. 2012 నుంచి ఇప్పటి వరకు 33 కేసుల్లో వినోద్ కుమార్ నిందితుడిగా ఉన్నాడు. ఒక రాబరీ కేసు, నాలుగు దొంగతనాలు, ఆరు దోపిడీ కేసులు, 8 మందిపై దాడి చేసిన కేసులు, ఐదు గ్యాంబ్లింగ్ కేసులు, ఒక గంజాయి కేసు, మరొకటి మద్యం అక్రమ విక్రయం కేసులలో నిందితుడిగా ఉన్నాడు. ఇతడిపై చాపాడు మండలంతోపాటు చెన్నూరు, కమలాపురం, ముద్దనూరు, వల్లూరు పోలీస్‌స్టేషన్‌లో ఉన్న ఏడు కేసులను ఆధారంగా చేసుకుని జిల్లా ఎస్పీ నచికేత్ ఆదేశాల మేరకు పీడీ యాక్ట్ కేసు నమోదు చేసి కడప సెంట్రల్ జైలుకు తరలించినట్లు రూరల్ సీఐ తెలిపారు.
ప్రమాదవశాత్తు మంటల్లో దగ్ధమైన కారు
వేంపల్లె : వేంపల్లెలో పార్కింగ్ చేసిన మారుతి 800 కారు మంగళవారం ప్రమాదవశాత్తు అగ్ని మంటల్లో దగ్ధమైంది. స్థానిక క్రిష్టియన్ కాలనీకి చెందిన నాగేంద్రకు చెందిన కారు పార్కింగ్ చేయగా, వైర్ల షార్టేజ్ వలన పార్కింగ్ చేసిన కారులో నుండి మంటలు వచ్చాయి. దీంతో వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. అయితే అగ్నిమాపానికి సంబంధించిన వాహనం అందుబాటులో లేకపోవడంతో స్థానికులే కలిసి కారులో చెలరేగిన మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అగ్ని మంటల్లో కారు పూర్తిగా కాలి పోవడంతో రికార్డులు కూడా కాలిపోయాయి. దాదాపు రూ.70 వేలు నష్టం వాటిల్లిందని బాధితుడు నాగేంద్ర తెలిపారు.
ప్రైవేటు వాహనాల తనిఖీ
ప్రైవేటు వాహనాల తనిఖీ


