ఒంటిమిట్ట రామయ్య వేటకు సర్వం సిద్ధం
● ముస్తాబైన పార్వేట మండపం
● భక్తుల ముంగిళ్ళకు రానున్న
ఒంటిమిట్ట శ్రీ రాముడు
ఒంటిమిట్ట : సంక్రాంతి పండుగలో భాగంగా మూడవ రోజు కనుమనాడు టీటీడీ సంప్రదాయబద్ధంగా నిర్వహించే పార్వేట ఉత్సవానికి ఒంటిమిట్ట రామయ్య బయలుదేరుతాడు. దాని కోసం టీటీడీ ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. స్థానిక నాగేటి తిప్పపై ఉన్న పార్వేట మండపాన్ని రంగు రంగు విద్యుత్ దీపాలతో ముస్తాబు చేశారు. పార్వేట అంటే తెలుగులో వేట అని అర్థం. ఇది దైవిక వేటను సూచిస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ వేటలో ఉత్సవ మూర్తులను వేటగాళ్ల రూపంలో అలంకరించి, రాక్షసులను వేటాడినట్లుగా పూజలు చేస్తారు. అనంతరం గ్రామోత్సవంలో జగదభిరాముడు భక్తుల ఇంటి ముంగిళ్లకు వెళ్లి కటాక్షించి, తిరిగి ఆలయానికి తీసుకొస్తారు. ఈ ప్రక్రియ దేవతలు వేటగాళ్ల వలె అడవులకు వెళ్లి దుష్టశక్తులను సంహరించి, ప్రజలను రక్షించడాన్ని సూచించే ఒక పౌరాణిక వేడుక. దీని ఏటా ఒంటిమిట్టలో టీటీడీ వారు వైభవంగా నిర్వహిస్తారు.


