నేడు అల్లసాని పెద్దన విగ్రహావిష్కరణ
కడప ఎడ్యుకేషన్: తెలుగులో తొలి ప్రబంధానికి శ్రీకారం చుట్టి రాయలసీమకు ఎనలేని కీర్తి తెచ్చిన ’ఆంధ్ర కవితా పితామహుడు ’అల్లసాని పెద్దన విగ్రహాన్ని సోమవారం పెద్దన నడయాడిన ఎర్రగుంట్ల మండలం పెద్దనపాడు గ్రామ శివాలయంలో ఆవిష్కరిస్తున్నట్లు కొత్తపు రామమోహన్ రెడ్డి తెలియజేశారు. కార్యక్రమానికి అధ్యక్షుడిగా వైఎస్సార్ కడప జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు ఆచార్య మూల మల్లికార్జున రెడ్డి, పెద్దన్న విగ్రహావిష్కర్తగా పంపాక్షేత్రం శ్రీ గోవిందానంద సరస్వతి స్వామి, గంగా చైతన్య కుమార్ రెడ్డి విగ్రహావిష్కర్తగా జిల్లా రెవిన్యూ అధికారి ఎం విశ్వేశ్వర నాయుడు పాల్గొననున్నారు. ఆంధ్ర కవితా పితామహుడు అల్లసాని పెద్దన (వ్యాస సంపుటి) పుస్తకావిష్కర్తగా ’మహా సహస్రావధాన స్థాపనాచార్య’ డాక్టర్ మేడసాని మోహన్, ఆలయ చరిత్ర శిలాఫలకం ఆవిష్కర్తగా తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యులు జి.భాను ప్రకాష్ రెడ్డి చేయనున్నారు. గౌరవ అతిథులుగా డాక్టర్ భూతపురి గోపాలకృష్ణ శాస్త్రి, జింకా సుబ్రహ్మణ్యం, ’పెద్దన జీవితం –సాహిత్యం ’అనే అంశంపై జరిగే శతాధిక కవి సమ్మేళన నిర్వాహకులుగా డాక్టర్ తవ్వా వెంకటయ్య, డాక్టర్ కొప్పోలు రెడ్డి శేఖర్ రెడ్డి, ’స్వామి వివేకానంద జీవితం –సాహిత్యం’ అనే అంశంపై పాఠశాల విద్యార్థులతో ఏర్పాటు చేసే క్విజ్ కు న్యాయ నిర్ణేత గా డాక్టర్ యాడికి శివ ప్రభాకర్ రెడ్డి విచ్చేయనున్నారన్నారని వారు తెలియజేశారు.


