తహసీల్దార్‌కు తప్పిన పెను ప్రమాదం
ఎర్రగుంట్ల : మండల పరిధిలోని పెద్దనపాడు గ్రామ సమీపంలో వీరపునాయునిపల్లె తహసీల్దార్‌కు పెను ప్రమాదం తప్పింది. సిమెంటు కాంక్రీట్ రోలర్ వాహనం వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. కారులో ఉన్న తహసీల్దార్ లక్ష్మీదేవికి, డ్రైవర్‌కు స్వల్ప గాయాలు అయ్యాయి. సంఘటన స్థలాన్ని ఎర్రగుంట్ల పోలీసులు పరిశీలించారు. వారు తెలిపిన వివరాల మేరకు.. వీరపునాయునిపల్లె మండలానికి చెందిన పట్టాదారు పాస్ బుక్కులను పంపిణీ చేసి తహసీల్దార్ లక్ష్మీదేవి కారులో ప్రొద్దుటూరుకు బయలుదేరింది. కారు పెద్దనపాడు గ్రామ సమీపానికి రాగానే శివాలయం దగ్గర క్రాస్ రోడ్డు వద్ద నుంచి వస్తున్న సిమెంటు కాంక్రీట్ రోలర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో కూర్చున్న తహసీల్దార్ లక్ష్మీదేవికి, డ్రైవర్‌కు గాయాలు అయ్యాయి. హుటాహుటిన సంఘటన స్థలానికి స్థానికులు చేరుకొని బాధితులను ప్రొద్దుటూరు ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.


