బస్సు ఢీకొని యువకుడి దుర్మరణం
సదుం : ఆర్టీసీ బస్సు, బైక్ ఢీకొని యువకుడు దుర్మరణం చెందిన సంఘటన మండలంలో ఆదివారం సాయంత్రం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. చెరుకువారిపల్లెకు చెందిన సయ్యద్‌బాషా కుమారుడు రఫీ (27) కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గానుగ పనులకు వెళ్లి వచ్చి, సొంత పనుల కోసం బైక్‌పై మండల కేంద్రానికి వచ్చాడు. తిరుగు ప్రయాణంలో మత్తుకువారిపల్లె సమీపంలోని మల్లేశ్వరస్వామి ఆలయం మలుపు వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో తలకు తీవ్ర గాయం అయ్యి అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటన స్థలాన్ని ఏఎస్‌ఐ సత్యనారాయణ పరిశీలించి, విచారణ చేశారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కుటుంబ సభ్యుల రోదన అందరినీ కలిచి వేసింది.
బస్సు ఢీకొని యువకుడి దుర్మరణం


