దరఖాస్తుల స్వీకరణ
కడప ఎడ్యుకేషన్: భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్, జిల్లా ప్రధాన కార్యాలయంలో ఈ నెల చివరి వారంలో రాజ్య పురస్కార్ , తృతీయ సోపాన్ (స్కౌట్స్ అండ్ గైడ్స్) క్యాంపులు నిర్వహించనున్నట్లు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా చీఫ్ కమిషనర్ డాక్టర్ షేక్ షంషుద్దీన్ పేర్కొన్నారు. వీటికి సంబంధించిన దరఖాస్తులను ఈ నెల8వ తేదీ వరకు కడప నగరం శంకరాపురంలోని భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా ప్రధాన కార్యాలయంలో స్వీకరించనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు డీ.ఓ.సి రమణయ్య, రోహిణి, సహాయ కార్యదర్శి ఖాదర్ బాషా, సంయుక్త కార్యదర్శి వెంకట సుబ్బయ్యలను సంప్రదించాలని పేర్కొన్నారు.
కమలాపురం: కమలాపురం మండలం నల్లలింగాయపల్లెలోని భారతి సిమెంట్స్ కాలనీకి చెందిన చౌడం సునంద జాతీయ స్థాయి యోగాసన పోటీల్లో విశేష ప్రతిభ చూపారు. డిసెంబర్ 30 నుంచి జనవరి 2వ తేదీ వరకు మహారాష్ట్రలో జరిగిన 6వ సీనియర్ జాతీయ స్థాయి యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్‌షిప్ 2025–26 పోటీల్లో పాల్గొన్న సునంద 35–40 ఏజ్ గ్రూప్‌లోని సుపైన్ ఆసనాల పోటీల్లో ద్వితీయ స్థానంలో నిలిచి వెండి పతకం అందుకున్నారు. పలువురు భారతి పరిశ్రమ ప్రతినిధులు, ఉద్యోగులు సునందను అభినందించారు.
కడప ఎడ్యుకేషన్: మహిళా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గురు చైతన్య ఉపాధ్యాయ సంఘం జిల్లాకు చెందిన మహిళా ఉపాధ్యాయురాలు వరలక్ష్మిని సౌత్ ఇండియా బెస్ట్ ఉమెన్ టీచర్ అవార్డుకు ఎంపిక చేసింది. ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు సంబంధించి బోధనలో ఉత్తమ ప్రతిభ, సృజనాత్మకత, వృత్తి పట్ల అంకిత భావం చూపిన 5 మంది ఉపాధ్యాయినిలను ఈ అవార్డుకు ఎంపిక చేయగా ఇందులో కడప జిల్లా పులివెందుల గవర్నమెంట్ మోడల్ ప్రైమరీ స్కూల్(రమణప్ప సత్రం)లో ప్రధానోపాధ్యాయురాలుగా పనిచేస్తున్న పీఎస్‌హెచ్‌ఎం, ఫోరమ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు వద్ది. వరలక్ష్మి అవార్డును అందుకున్నారు. ఇందుకు ఏపీపీఎస్ హెచ్‌ఎం ఫోరం తరపున ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు సీవీ ప్రసాద్ అభినందనలు తెలిపారు. ఒకవైపు పాఠశాల అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటూ విద్యార్థులకు విన్నూత్నంగా, వివిధ యాక్టివిటీ బేస్డ్ కార్యక్రమాల ద్వారా పిల్లలకు చక్కగా, ఆహ్లాదకర వాతావరణం ఏర్పరుస్తూ పిల్లల అభిరుచులకు తగినట్లు బోధిస్తూ విద్యార్థులను తీర్చిదిద్దడంపై ఈమె శ్రద్ధ అభినందనీయమన్నారు.
దరఖాస్తుల స్వీకరణ
దరఖాస్తుల స్వీకరణ


