వ్యక్తి ఆత్మహత్య
డ్రైవర్ మల్లికార్జున ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా.. ఇతడి మృతి పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. భార్యతో మనస్పర్థలే కారణమని పోలీసులు అంటున్నారు. అయితే అతడి బంధువులు మాత్రం పోలీసుల కోటింగ్ ఎక్కువగా ఉంటుందనే భయంతోనే
ఆత్మహత్య చేసుకున్నాడని చెబుతున్నారు. విచారణలో వాస్తవాలు తెలియాల్సి ఉంది.
చక్రాయపేట : మండలంలోని సురభి గ్రామం కుప్పగుట్టపల్లెకు చెందిన పెద్ది మోయిన మల్లికార్జున(49) అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌ఐ చంద్రశేఖర్ తెలిపారు. అయితే ఈ ఆత్మహత్యపై పోలీసులు, బంధువులు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మల్లికార్జునకు ఆయన భార్య సుజాత మధ్య గత కొంతకాలంగా మనస్పర్థలు ఉన్నాయని వాటితో విసుగు చెంది తాగుడుకు బానిసై పురుగు మందు తాగి చనిపోయినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. అయితే బంధువులు మాత్రం మల్లికార్జున వృత్తిరీత్యా డ్రైవర్ అని ఇటీవల కుటుంబ సభ్యుల ఫిర్యాదులు ఉండటంతో పాటు సోమవారం రాత్రి వాహనాల తనిఖీ నిమిత్తం విధి నిర్వహణలో ఉన్న నాగరాజు, నరసింహరాజు అనే ఇద్దరు హోం గార్డులపైకి మల్లికార్జున నడుపుతున్న జీపు ఢీ కొట్టడంతో వారు గాయపడ్డారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి గాయపడ్డ హోం గార్డులను చికిత్స నిమిత్తం కడప రిమ్స్‌కు తరలించారు. దీంతో పోలీసుల కోటింగ్ ఎక్కువగా ఉంటుందని భయంతో పురుగుల మందు తాగాడని బంధువులు పేర్కొంటున్నారు. మల్లికార్జున పురుగుల మందు తాగిన విషయం తెలుసుకొని చికిత్స నిమిత్తం రాయచోటిలోని ఓ ప్రవేటు వైద్యశాలకు తరలించగా అక్కడ చనిపోయినట్లు బంధువులు తెలిపారు. మృతుడికి ముగ్గురు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నారు. వీరిలో ఒక కుమార్తెకు పెళ్లి అయింది. మరో ఇద్దరు కూతుర్లు పెళ్లీడుకు వచ్చారని బంధువులు పేర్కొన్నారు.
గూడ్స్ రైలు కిందపడి వ్యక్తి మృతి
కడప కోటిరెడ్డిసర్కిల్ : జిల్లాలోని భాకరాపేట–కనుమలోపల్లె రైలు మార్గం (మిట్టపల్లి వద్ద)లో 60 సంవత్సరాల వయస్సుగల గుర్తుతెలియని వ్యక్తి గూడ్స్ రైలు కిందపడి మృతి చెందాడని రైల్వే పోలీసులు తెలిపారు. మృతుడు బ్లూ కలర్ పై తెలుపు రంగు గీతలు కలిగిన ఫుల్ షర్టు, నలుపు రంగు కలిగిన ఫార్మల్ ప్యాంటు, పారగాన్ చెప్పులు కలిగి ఉన్నాడన్నారు. మృతుని వివరాలు తెలిసినవారు కడప రైల్వే పోలీసులకుగానీ, ఎస్‌ఐ 9440900811, సీఐ 9440627398లకు సమాచారం అందించాలన్నారు.
సోఫాల దుకాణం దగ్ధం
పులివెందుల రూరల్ : పట్టణంలోని స్థానిక బైపాస్ రోడ్డులో నాగేంద్రకు చెందిన సోఫాల దుకాణంలో మంగళవారం షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగాయి. ఈ మంటలను చూసిన పక్క దుకాణదారులు వెంటనే ఫైర్ సిబ్బందికి విషయాన్ని తెలిపారు. ఫైర్ సిబ్బంది హుటాహుటినా అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అప్పటికే దుకాణంలో ఉన్న సోఫాలకు సంబంధించిన సామగ్రి పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. దాదాపు రూ.12 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు బాధితుడు తెలిపారు. ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన కోరారు.
వ్యక్తి ఆత్మహత్య
వ్యక్తి ఆత్మహత్య


