‘భారతి’ విద్యార్థుల ప్రతిభ
కమలాపురం : చెకుముకి సైన్స్ సంబరాలు–2025లో భాగంగా మండల స్థాయి పోటీల్లో మండలంలోని నల్లలింగాయపల్లెలో వెలసిన ‘డీఏవీ భారతి’ విద్యార్థులు ప్రతిభ చాటి జిల్లా స్థాయి పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపల్ శివ్వం కిషోర్ కుమార్ తెలిపారు. స్థానిక ఎంఆర్‌సీలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన మండల స్థాయి పోటీల్లో డీఏవీ భారతి విద్యామందిర్‌కు చెందిన జోష్ణ(10వ తరగతి), మహేశ్వరీ (9వ తరగతి), చాంద్ (8వ తరగతి) ప్రతిభ కనబరిచి మొదటి స్థానంలో నిలిచారు. కాగా ఈ నెల 23వ తేదీన జరిగే జిల్లా స్థాయి పోటీలకు వీరు హాజరు అవుతారని ప్రిన్సిపల్ వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైన్స్ టాలెంట్ పరీక్షల వలన విద్యార్థులలో సైన్స్ అవగాహనను పెంపొందించడంతో పాటు వారిలో శాసీ్త్రయ నైపుణ్యాలను గుర్తించి ప్రోత్సహించడానికి ఉపయోగ పడతాయన్నారు. కాగా ప్లాంట్ హెడ్ రామమూర్తి, హెచ్‌ఆర్ గోపాల్‌రెడ్డి, డీఏవీ ప్రాంతీయ అధికారి శేషాద్రి తదితరులు విద్యార్థులతో పాటు సైన్స్ ఉపాధ్యాయ బృందాన్ని ప్రశంసించారు.


