అండర్–14 క్రికెట్ మ్యాచ్‌లు ప్రారంభం
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : ఏసీఏ సౌత్‌జోన్ అండర్–14 మల్టీ డే మ్యాచ్‌లు మంగళవారం వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభం అయ్యాయి. తొలి రోజు వైఎస్‌ఆర్‌ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో నెల్లూరు–చిత్తూరు జట్లు తలపడ్డాయి. ముందుగా టాస్ గెలిచిన చిత్తూరు జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన నెల్లూరు జట్టు 51.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది. ఆ జట్టులోని కిన్నుకిషల్ 77 పరుగులు, ఎస్‌కె సమీర్ 26 పరుగులు చేశారు. చిత్తూరు జట్టులోని రక్షన్ సాయి 3 వికెట్లు తీశాడు. దీంతో తొలి రోజు ఆట ముగిసింది.
కెఎస్‌ఆర్‌ఎం క్రికెట్ మైదానంలో....
అదే విధంగా కెఎస్‌ఆర్‌ఎం క్రికెట్ మైదానంలో తొలి రోజు అనంతపురం –కర్నూలు జట్లు తలపడ్డాయి. ముందుగా టాస్ గెలిచిన అనంతపురం జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో బ్యాంటింగ్‌ను ప్రారంభించిన అనంతపురం జట్టు 45 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. ఆ జట్టులోని ముకేష్ మోక్షజ్ఞ తేజ్ 124 బంతుల్లో 18 ఫోర్లు, ఒక సిక్పర్‌తో 102 పరుగులు చేశాడు. హేమచంద్ర నాయక్ 59 పరుగులు చేశాడు. కర్నూలు జట్టులోని హేమంత్ 2 వికెట్లు, చేతన్ సాయి 1 వికెట్ తీశారు. దీంతో తొలి రోజు ముగిసింది.
హేమ చంద్ర నాయక్
అనంతపురం, (59 పరుగులు)
ముకేష్ మోక్షజ్ఞ తేజ్,
అనంతపురం, (102 పరుగులు)
కిన్ను కిషల్, నెల్లూరు
(77 పరుగులు)
అండర్–14 క్రికెట్ మ్యాచ్‌లు ప్రారంభం
అండర్–14 క్రికెట్ మ్యాచ్‌లు ప్రారంభం


