ప్రారంభమైన పది మూల్యాంకనం
కడప ఎడ్యుకేషన్: పదో తరగతి పరీక్షల సమాధాన పత్రాల మూల్యాంకనం గురువారం కడపలోని మున్సి పల్ హైస్కూల్ మొయిన్‌లో ప్రారంభమైంది. ఈ మూల్యాంకనానికి క్యాంపు ఆఫీసర్‌గా డీఈఓ షేక్ షంషుద్దీన్ వ్యవహరించారు. ఈ మూల్యాంకనానికి రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల నుంచి అన్ని సబ్జెక్టులకు సంబంధించి 1,75,934 పేపర్లు వచ్చాయి. ఈ మూల్యాంకన విధుల్లో 105 మంది చీఫ్ ఎగ్జామినర్లు, 604 మంది అసిస్టెంట్ ఎగ్జామినర్లు, 198 మంది స్పెషల్ అసిస్టెంట్లు పాల్గొని 12,910 పేపర్లను మూల్యాంకనాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా క్యాంపు ఆఫీసర్, డీఈఓ షేక్ షంషుద్దీన్ మాట్లాడుతూ ఈ మూల్యాంకన ప్రక్రియ ఈ నెల 9 వరకు జరుగుతుందన్నారు. తొలి రోజు 12, 910 పేపర్లను మూ ల్యాంకనం చేశారని ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ వెంకటేసు తెలిపారు.
తొలి రోజు 12,910
సమాధాన పత్రాలకు మూల్యాంకనం


