యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి
కడప ఎడ్యుకేషన్ : యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సీనియర్ సివిల్ జడ్జి బాబా ఫకృద్దీన్ పేర్కొన్నారు. జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా సోమవారం బాలాజీ నగర్‌లోని శ్రీ వెంకటేశ్వర ఇంజినీరింగ్ కళాశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్తు పదార్థాలు వాడడం చట్టరీత్యా నేరం అన్నారు. అలాగే లీగల్ సర్వీసెస్ అథారిటీ చట్టం 1987, లీగల్ సర్వీసెస్ క్లినిక్స్ విధులు, ఎన్‌డీపీఎస్ చట్టము 1985, ద డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం 1940, కాస్మెటిక్స్ రూల్స్ 1945, ద ప్రివెన్షన్ ఆఫ్ లిసిట్ ట్రాఫికింగ్ ఇన్ నార్కోటి ట్రక్స్ అండ్ సైకో చట్టం 1988, జునైల్ జస్టిస్ చట్టం 2015 ఆర్టికల్ 15(3), ఆర్టికల్ 21, 39 ఎఫ్, 47, నేషనల్ హెల్త్ పాలసీ 2017 గురించి తెలియజేశారు. అలాగే విద్యార్థులు సమతుల్య, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలన్నారు. అలాగే క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయడంతో పాటు పొగాకు, మద్యానికి దూరంగా ఉండాలని సూచించారు. విద్యార్థులు మాససి ఒత్తిడిని తగ్గించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డిస్టిక్ ప్రోగ్రాం ఆఫీసర్ భాస్కర్, ప్యానల్ న్యాయవాది విక్రమ్, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ న్యాయవాదులు నీలకంఠేశ్వర్ రెడ్డి, అక్బర్ అలీ, ఇన్‌చార్జ్ యూత్ ఆఫీసర్ ప్రేమ్, శ్రీ వెంకటేశ్వర ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సుదర్శన్ రెడ్డి, మై భారత్ వలంటీర్లు, స్వచ్ఛంద సంస్థ ఎన్జీవోలు, పారా లీగల్ వలంటరీలు ఈశ్వరయ్య శ్రీనివాసరావు పాల్గొన్నారు.
సీనియర్ సివిల్ జడ్జి బాబా ఫకృద్దీన్


