కలసపాడు : అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలకు భారతి సిమెంట్ పటిష్టమైనదని భారతీ సిమెంట్ కంపెనీ టెక్నికల్ ఇంజినీర్లు శ్రీకాంత్‌రెడ్డి, నాగేంద్ర, సేల్స్ మేనేజర్ శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. స్థానిక సీఎంఆర్ కల్యాణ మండపంలో గురువారం బిల్డర్లు, మేసీ్త్రలకు సిమెంటు వినియోగంపై అవగాహన సదస్సు నిర్వహించారు. భారతి సిమెంట్ ప్రతినిధులు మాట్లాడుతూ భారతి సిమెంట్ రోబోటిక్ టెక్నాలజీతో తయారవుతోందన్నారు. అల్ట్రా ఫాస్ట్ నాణ్యత కలిగి ఉంటుందని, ఇతర కంపెనీల సిమెంట్‌కు ఐదు గంటలు పడితే భారతి సిమెంట్ అల్ట్రా ఫాస్ట్ రెండు గంటల్లోనే గట్టి పడుతుందన్నారు. చాలా దృఢత్వాన్ని కలిగి కట్టడాలు త్వరగా పూర్తవుతాయని తెలిపారు. అనంతరం వంద మంది మేసీ్త్రలకు రూ.లక్ష విలువ గల ఉచిత ప్రమాద బీమా బాండ్లు అందజేశారు. కార్యక్రమంలో డీలర్ వెంకటసుబ్బయ్య, మేసీ్త్రలు తదితరులు పాల్గొన్నారు.