బాలాజీ డివిజన్ ఏర్పాటు అవసరం
బాలాజీ డివిజన్ ఏర్పాటు ఎంతైనా అవసరం. విశాఖ జోన్ ఏర్పడుతున్న క్రమంలో కొత్త డివిజన్లను ఏర్పా టు చేయాల్సి వస్తే అది ముందుగా బాలాజీ డివిజన్ ఉంటుందని భావి స్తున్నాను. డివిజన్ కావడానికి అన్ని అర్హతలు బాలాజీ డివిజన్‌కు ఉన్నాయని రైల్వే నిపుణుల భావన. కేంద్ర రైల్వేమంత్రిత్వశాఖ ఆ దిశగా అడుగులు వేయాలని కోరుతున్నాను.
–పీవీ మిథున్‌రెడ్డి, ఎంపీ, రాజంపేట
ఇది దశాబ్దాల డిమాండ్
రాయలసీమ కేంద్రంగా తిరుపతిని ఆధారం చేసుకొని బాలాజీ డివిజన్ ఏర్పా టుచేయడం అనుకూలం. ఈ డివిజన్ ప్రతిపాదన దశాబ్దాల కాలం నాటిది. గతంలో కూడా ఈ డివిజన్ ఏర్పాటు పరిస్ధితులపై అధికారులు పరిశీలనలు కూడా చేశారు. బాలాజీ డివిజన్ ఏర్పాటు అ మలుచేయాలని పెద్దలసభలో చర్చించాను. కొత్త డివిజన్ ఏర్పాటుతో ఐదు జిల్లాలకు పూర్వవైభవం వస్తుంది. – రఘునాథరెడ్డి, రాజ్యసభ సభ్యుడు
బాలాజీ డివిజన్ ఏర్పాటు అవసరం


