జేసీగా నిధి మీనా బాధ్యతల స్వీకరణ
కడప సెవెన్‌రోడ్స్: జిల్లా జాయింట్ కలెక్టర్‌గా డాక్టర్ నిధి మీనా శనివారం బాధ్యతలు స్వీకరించారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో 10.45 గంటలకు బాధ్యతలు చేపట్టారు. రాజస్థాన్‌కు చెందిన నిధి మీనా 2019 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. డిల్లీ యూనివర్శిటీలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. తెనాలి సబ్ కలెక్టర్‌గా, వయోజన విద్య డైరెక్టర్ గా, ఎన్టీఆర్ జిల్లా జేసీగా విధులు నిర్వర్తించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జేసీగా తన బాధ్యతలను వంద శాతం పూర్తి చేస్తానన్నారు. రెవెన్యూ సమస్యలను పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తానని తెలిపారు. అంతకుముందు జేసీకి డీఆర్వో విశ్వేశ్వర నాయుడు,కడప ఆర్డీఓ జాన్ ఇర్విన్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వెంకటపతి, కలెక్టరేట్ పరిపాలన అధికారి విజయ్ కుమార్,అన్ని సెక్షన్‌ల పర్యవేక్షకులు స్వాగతం పలికారు.
కలెక్టర్‌ను కలిసిన జేసీ
జాయింట్ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ నిధి మీనా శనివారం కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరిని క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి పూలమొక్కలను అందజేశారు.
సమాచారం ఇవ్వని ఐఅండ్‌పీఆర్
కొత్త జేసీగా డాక్టర్ నిధి మీనా శనివారం బాధ్యతలు చేపడుతున్న విషయాన్ని సమాచార పౌరసంధాలశాఖ జిల్లా అధికారి పత్రికలకు తెలియజేయకుండా కొత్త సంప్రదాయానికి తెర తీశారు. జిల్లాలో కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు బాధ్యతలు చేపట్టే సందర్భంలో ముందుగా పత్రికలకు తెలియజేయడం తొలినుంచి వస్తోంది. కానీ ఈసారి ఐఅండ్‌పీఆర్ ఏడీ ఆ విషయాన్ని విస్మరించారు.


