కడప కోటిరెడ్డిసర్కిల్: జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో ఒంటిపూట బడి నిర్వహించాలని ఐసీడీఎస్ ఇన్‌చార్జి పీడీ సునీత ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 18 నుంచి మొద లైన ఒంటిపూట బడి సమయ వేళలు ఏప్రిల్ 31వ తేది వరకు అమల్లో ఉంటాయని పేర్కొ న్నారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అంగన్వాడీ కేంద్రాలను నడపాలని సూచించారు.
23న దేవుని కడప పోలీసు డిపార్ట్‌మెంట్ ఉద్యోగుల సభ
కడప అర్బన్: దేవుని కడప పోలీసు డిపార్ట్‌మెంట్ ఉద్యోగుల పరస్పర సహకార గృహ నిర్మాణ సంఘం సంవత్సరపు మహాజన సభ ఈనెల 23 వతేదీన ఉదయం 10 గంటలకు కడపలోని వైఎస్‌ఆర్ పోలీసు కాలనీలో నిర్వహించనున్నట్లు దేవుని కడప పోలీస్ హౌసింగ్ సొసైటీ ప్రెసిడెంట్ కె. ప్రభాకర్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సంఘంలో ఇళ్ల స్థలాలు పొందిన సభ్యులు గృహ నిర్మాణం చేసుకునే విషయాలతోపాటు, ఇతర అంశాలపై చర్చ జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
కేజీబీవీల్లో అడ్మిషన్లకు దరఖాస్తుల ఆహ్వానం
కడప ఎడ్యుకేషన్: జిల్లాలోని 17 కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాల్లో 6,11 తరగతులలో ప్రవేశాలకు 2025–26 విద్యా సంవత్సరానికి ఆన్‌లైన్ ద్వారా మార్చి 22 నుంచి మే 11వ తేదీ వరకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సమగ్రశిక్ష ఏపీసీ నిత్యానందరాజులు తెలిపారు. అలాగే కేజీబీవీల్లో 7,8,9 తరగతులలో మిగిలిన సీట్ల కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. దరఖాస్తులను https://apkgbv.apcfss.in వెబ్‌సైట్ ద్వారా చేసుకోవాలని తెలిపారు.
మైనార్టీ బాలుర పాఠశాలలో ప్రవేశాలకు...
కడప ఎడ్యుకేషన్: కడపలోని ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాల (మైనార్టీ బాలుర)లో 2025–26 విద్యా సంవత్సరానికిగాను ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ పేతకంశెట్టి సోమ సత్యశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. 5వ తరగతిలో 80 సీట్లు, 6,7,8 తరగతుల్లో మిగిలిన సీట్లకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. మైనార్టీ బాలురతోపాటు ఎస్సీ, ఎస్టీ బాలురు కూడా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ నెల 31లోగా https://aprs. apcffss.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఏప్రిల్ 25వ తేదీ ప్రవేశ పరీక్ష ఉంటుందని వివరించారు. వివరాలకు 7780179446, 90595 00173 నెంబర్లను సంప్రదించాలని ప్రిన్సిపాల్ తెలిపారు.
ఉప సర్పంచుల
ఎన్నికకు నోటిఫికేషన్
కడప సెవెన్‌రోడ్స్: జిల్లాలో వివిధ కారణాల వల్ల ఖాళీగా ఉన్న తొమ్మిది ఉప సర్పంచుల స్థానా లను భర్తీ చేసేందుకు ఈనెల 27వ తేది ఉదయం 10 గంటలకు ఎన్నిక నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించేందుకు జిల్లా పంచాయతీ అధికారి జి.రాజ్యలక్ష్మి బుధవారం ప్రొసీడింగ్స్ జారీ చేశారు. ప్రొద్దుటూరు మండలం గోపవరం, సింహాద్రిపురం మండలం అంకాలమ్మగూడూరు, సీకే దిన్నె మండలం బుసిరెడ్డిపల్లె, కమలాపురం మండలం కోగటం, బ్రహ్మంగారిమఠం మండలం గొడ్లవీడు, ఎర్రగుంట్ల మండలం తుమ్మలపల్లె, చిర్రాజుపల్లె, దువ్వూరు మండలం ఇడమడక, చెన్నూరు మండలం ముండ్లపల్లె పంచాయతీలకు సంబంధించిన ఉప సర్పంచ్ ఎన్నికలు జరగనున్నా యి. ఇందుకోసం అధికారులను నియమించా రు. ఏదైనా కారణాల రీత్యా ఆరోజు ఎన్నిక జరగకపోతే మరుసటిరోజు నిర్వహించాల్సి ఉంటుంది.
జూడాల సంఘం
నూతన కమిటీ ఏర్పాటు
కడప అర్బన్: ప్రభుత్వ వైద్య కళాశాల జూనియర్ డాక్టర్ల సంఘం (జీఎంఎస్‌కె– జూడా) కొత్త కమిటీ ఏర్పాటైంది. ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ. సురేఖ, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వై. విజయభాస్కర్ రెడ్డి కొత్త కమిటీని అభినందించారు. అధ్యక్షుడిగా ఎన్నికై న డాక్టర్ ఎస్. విష్ణు వర్ధన్ రెడ్డి, ఉపాధ్యక్షుడు డాక్టర్ బి. విజయ్, డాక్టర్ చరిత, డాక్టర్ పూజ, డాక్టర్ ప్రతిభ, ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎ. నిఖిల్ సింగ్, డాక్టర్ సుబ్బారెడ్డి కళాశాలలోని సమస్యల గురించి ప్రిన్సిపల్‌కు వినతిపత్రం అందజేశారు. కళాశాల సమస్యల గురించి ప్రస్తావించారు. సానుకూలంగా స్పందించిన ప్రిన్సిపల్ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.