ఎర్రగుంట్ల : ఎర్రగుంట్ల మండల పరిధిలోని ప్రొద్దుటూరు రోడ్డులో ఎస్వీ కల్యాణ మండపం సమీపంలో ఉన్న శ్రీ ఆంజనేయస్వామి గుడి దగ్గర ఆటోను గుర్తు తెలియని ఐచర్ వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ చంగల రామాంజనేయులుతో పాటు ఆటోలో ఉన్న మరో ఆరుగురికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ప్రొద్దుటూరు పట్టణంలోని డ్రైవర్ కొట్టాల కాలనీకి చెందిన అల్లం లక్ష్మీనారాయణమ్మ, అల్లం జగన్నాథం, అల్లం నాగ పద్మ, అల్లం నాగ బిందు, జి.నాగముని, జి. రామాంజనేయులు ప్రొద్దుటూరులోని ఒకే కుటుంబానికి చెందినవారేరు. వీరంతా ప్రొద్దుటూరు వెళ్లేందుకు చంగల రామాంజనేయులుకు చెందిన ఆటో ఎక్కారు. ఎస్వీ కల్యాణ మండపం వద్దకు రాగానే ఆటో వెనుక వైపు గుర్తు తెలియని ఐచర్ వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ చంగల రామాంజనేయులు కాళ్లకు తీవ్ర గాయాలు కాగా, ఆటోలో ఉన్న మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయి. వీరిని ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.