కడప ఎడ్యుకేషన్: యోగి వేమన విశ్వవిద్యాలయం పరిధిలోని 15 కేంద్రాల్లో బీఈడీ, ఎంఈడీ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యా యి. బీఈడీ పరీక్షలకు 4,463 మంది విద్యార్థులు, ఎంఈడీ పరీక్షలకు 63 మంది విద్యార్థులు హాజరయ్యారు. కడపలోని నాగార్జున మహిళా డిగ్రీ కళాశాలలో, విజయలక్ష్మి బీఈడీ కళాశాల పరీక్షా కేంద్రాలను విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య పుత్తా పద్మ, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆచార్య కేఎస్వి కృష్ణారావు, అబ్జర్వర్లు ఆచార్య మాధవి, ఆచార్య రియాజ్ ఉన్నిసా ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షలు కట్టుదిట్టంగా నిర్వహించేలా చూడాలని చీఫ్ సూపరింటెండెంట్‌లకు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆచార్య కేఎస్వీ కష్ణారావు మాట్లాడుతూ పరీక్షలు ఈనెల 22వ తేదీ వరకు కొనసాగుతాయని తెలిపారు.
గండి దేవస్థాన భూములకు వేలం పాట
చక్రాయపేట : మండలంలోని మారెళ్ల మడక గ్రామ పంచాయతీలో ఉన్న గండి వీరాంజనేయస్వామి ఆలయంలో సోమవారం ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో గండి దేవస్థాన భూములకు వేలం పాట నిర్వహించారు. ఈ వేలం పాటలో ఇడుపులపాయ గ్రామ సర్వే నెంబర్ 469లో గల 8.72 ఎకరాల భూమిని ఏడాది కాలానికి రూ.1.51 లక్షలకు పి.జి.మహేష్ దక్కించుకున్నారు. అలాగే వీరన్నగట్టుపల్లె గ్రామంలోని 98 సెంట్ల భూమిని రూ.4 వేలకు ఆర్.తేజేశ్వర దక్కించుకున్నారు. అలాగే గండి దేవస్థానానికి సంబంధించిన సులభ్ కాంప్లెక్స్‌ను రూ.20 వేలకు ఇడుపులపాయకు చెందిన పి.వెంకటరత్నం దక్కించుకున్నారు. కార్యక్రమంలో దేవస్థాన చైర్మన్ కృష్ణతేజ, మాజీ చైర్మన్ వెంకటస్వామి, దేవస్థాన ఉప ప్రధాన అర్చకుడు రాజా రమేష్, ఆలయ సిబ్బంది, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.
వైవీయూ ఉపకులపతిగా ఆచార్య అల్లం శ్రీనివాసరావు
కడప ఎడ్యుకేషన్ : యోగి వేమన విశ్వవిద్యాలయం ఉపకులపతిగా ఆచార్య అల్లం శ్రీనివాసరావు నియమితులయ్యారు. నెల్లూరు విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం ఉపకులపతిగా పనిచేస్తున్న ఆయనను వైవీయూ ఇన్‌చార్జి వీసీగా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఆర్డర్ ద్వారా ప్రభుత్వ కార్యదర్శి కోన శశిధర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇది వరకు వైవీయూ ఉపకులపతిగా బాధ్యతలు స్వీకరించిన ఆచార్య ఫణతి ప్రకాష్‌బాబు పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్‌గా నియమితులు కావడంతో ఆయనను రిలీవ్ చేశారు. ఆ స్థానంలో నూతన ఇన్‌చార్జి వైస్ ఛాన్సలర్‌గా ఆచార్య అల్లం శ్రీనివాసరావును నియమించారు. ఒకటి రెండు రోజుల్లో ఆయన వీసీగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
25న రాజంపేట బార్ అసోసియేషన్ ఎన్నికలు
రాజంపేట : రాజంపేట బార్ అసోసియేషన్‌కు ఎన్నికలు నిర్వహించనున్నారు. సోమవారం నామినేషన్ల ప్రక్రియ సీఈఓ పి.సురేష్‌కుమార్ నేతృత్వంలో ప్రారంభమైంది. బార్ అసోసియేషన్ అధ్యక్ష స్థానానికి హనుమంతు నాయుడు నామినేషన్‌ను దాఖలు చేశారు. మంగళవారం కూడా నామినేషన్‌ల ప్రక్రియ జరుగుతుంది. 19న నామినేషన్‌ల స్క్రూటిని, 20న నామినేషన్ల ఉపసంహరణ, 21న పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా, 25న పోలింగ్, అదే రోజున కౌంటింగ్ నిర్వహించనున్నారు.
నేడు డయల్ యువర్ డీఎం
కడప కోటిరెడ్డి సర్కిల్ : కడప నగరంలోని స్థానిక ఆర్టీసీ డిపో మేనేజర్ కార్యాలయంలో మంగళవారం డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వ హిస్తున్నట్లు ఆర్టీసీ డీఎం ఢిల్లీశ్వరరావు తెలిపారు. సోమవారం ఆయన తెలుపుతూ మంగళవారం సాయంత్రం 5గంటల నుండి 6గంటల వరకు డయల్ యువర్ డీఎం కార్యక్రమం ఉంటుందని, ఈ కార్యక్రమంలో ప్రజలు, ప్రయాణీకులు తమ సమస్యలను, సూచనలు, సలహాలను 99592 25774 అనే ఫోన్ నెంబర్‌కు ఫోన్ చేసి కానీ, వాట్సాప్ ద్వారా కానీ తెలియజేయాలన్నారు.
బీఈడీ పరీక్షలు షురూ
బీఈడీ పరీక్షలు షురూ