కడప ఎడ్యుకేషన్ : యోగి వేమన యూనివర్సిటీ పరిధిలోని ప్రైవేట్ డిగ్రీ అండ్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నగరంలోని స్క్వేర్ సమావేశ మందిరంలో జరిగిన అసోసియేషన్ నాయకుల సమావేశంలో నూతన అధ్యక్షుడిగా రాజంపేట గీతాంజలి డిగ్రీ కాలేజ్ కరస్పాండెంట్ సంభావు వెంకటరమణ, కార్యదర్శిగా ముద్దనూరు వెంకటేశ్వర డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ జి.శ్రీనివాసులు, ఉపాధ్యక్షులుగా నాగేశ్వరరెడ్డి, జయప్రకాశ్‌రెడ్డి, కోశాధికారిగా ఆలీ అక్బర్, సంయుక్త కార్యదర్శిగా ఎన్.సంజీవరెడ్డి, రవి శేఖర్ రెడ్డి మిగిలిన సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో మాజీ అధ్యక్షులు మదనమోహన్ రెడ్డి, రవి శేఖర్ రెడ్డి, సుబ్బారెడ్డి, పెంచలయ్య, రాజగోపాల్ రెడ్డి, పోలా రమణారెడ్డి, రాష్ట్ర నాయకులు పి.సురేష్, విజయ్ కుమార్, మనోహర్ రెడ్డి, రాఘవరెడ్డి, సంజీవరెడ్డి, నరసింహులు, వివిధ కళాశాలల కరస్పాండెంట్లు పాల్గొన్నారు.
ప్రైవేట్ డిగ్రీ అండ్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ కార్యవ