గ్రామానికి సేవ చేసేందుకే
అడవిదేవులపల్లి : గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో నేను రాజకీయాల్లోకి వచ్చా. బీటెక్ చదివి, హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్న నన్ను సర్పంచ్‌గా పోటీ చేయమని స్థానికులు కోరడంతో ఉద్యోగం వదిలేసి ప్రజాసేవ చేయాలని నిర్ణయించుకున్నా. గతంలో నా తండ్రి సూర్యానాయక్ ఉమ్మడి మొల్కచర్ల సర్పంచ్‌గా పని చేసినందుకు గ్రామ సమస్యలపై నాకు చిన్ననాటి నుంచి పూర్తిస్థాయిలో అవగాహన ఉంది. నన్ను గెలిపించిన గ్రామ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరిస్తా. పదవీ కాలం పూర్తయ్యే సరికి శాశ్వతంగా గుర్తుండేలా నా వంతుగా అభివృద్ధి చేసి చూపిస్తా. – మూడావత్ సేవానాయక్,
మొల్కచర్ల సర్పంచ్
పెద్దఅడిశర్లపల్లి : ప్రస్తుతం కొండమల్లేపల్లిలో డిగ్రీ చదువుతున్నా. 24 ఏళ్లకే సర్పంచ్‌గా ఎన్నికయ్యా. రానున్న రోజుల్లో మల్లాపురం గ్రామంలో సమస్యలను పరిష్కరించడంతో పాటు గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తా. సమస్యలను ఒక్కొక్కటిగా తీసుకొని అధికారులు, వార్డు సభ్యులు, ఎమ్మెల్యే సహకారంతో పరిష్కరిస్తా. ముఖ్యంగా గ్రామంలో మౌలిక వసతులు కల్పించడంలో ప్రత్యేక దృష్టి సారిస్తా.
– కొలుకులపల్లి చందన, మల్లాపురం సర్పంచ్
గ్రామానికి సేవ చేసేందుకే


