సద్గుణకు మెరుగైన వైద్యమందిస్తాం
తుర్కపల్లి : మండల కేంద్రానికి చెందిన గర్భిణి బండారు సద్గుణకు వైద్యసాయమందిస్తామని డీఎంహెచ్‌ఓ మనోహర్ అన్నారు. శనివారం తుర్కపల్లికి చెందిన బండారి సద్గుణ కడుపునొప్పితో బాధపడుతూ స్థానిక పీహెచ్‌సీకి వస్తే వైద్యసిబ్బంది అందుబాటులో లేక వైద్యం అందలేదు. ఈ ఘటనపై స్పందించిన డీఎంహెచ్‌ఓ ఆదివారం బండారి సద్గుణ ఇంటి వద్దకు వెళ్లి కలిసి ఆమె ఆర్యోగ పరిస్థితిని అడిగి తెలుసుకుని మాట్లాడారు. సద్గుణకు ఎలాంటి వైద్య అవసరమైనా చేయాలని సిబ్బదికి సూచించారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ సోమల్ల వెంకటేష్.. డీఎంహెచ్‌ఓను కలిసి పీహెచ్‌సీలో సిబ్బంది కొరత లేకుండా చూడాలని కోరారు. ఆసుపత్రిలో పనిచేయాల్సిన సిబ్బంది డిప్యుటేషన్‌పై ఇతర ప్రాంతాల్లో విధులు నిర్వహించడం వల్ల ఇక్కడి రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. పూర్తిస్థాయిలో సిబ్బంది ఉండేలా చూడాలని విన్నవించారు.
ఫ డీఎంహెచ్‌ఓ మనోహర్


