ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా కమిటీ ఎన్నిక
భువనగిరిటౌన్ : భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల భవనంలో ఆదివారం నిర్వహించిన ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా సర్వసభ్య సమావేశంలో ఆ సంఘం జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా బొడ్డు కృష్ణయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శిగా నాగటి వెంకటేష్, గౌరవ అధ్యక్షుడిగా గంటెపాక స్వామి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎర్రబెల్లి నాగమల్లు, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడిగా భూక్య గోవింద్ నాయక్, జిల్లా ఉపాధ్యక్షులుగా నరాల కృష్ణ, మతిదొడ్డి సునిత, జిల్లా కోశాధికారిగా గూడెపు పరుశరాములు, జిల్లా కార్యదర్శి బండారు మల్లయ్య ఎన్నికయ్యారు. ఈ సమావేశానికి ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తొంట సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కటాఫ్ మార్కులకు సమానంగా లేదా అంతకంటే ఎక్కువ మార్కులు వచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీలను అన్ రిజర్వుడ్ (జనరల్) కోటాలోనే ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర ప్రధాన సలహాదారులు బండారు రవి వర్ధన్, రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ అధ్యక్షుడు దారపు శ్రీనివాసులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు పానుగంటి యాదగిరి, నాయకులు గంటెపాక స్వామి,ఎర్రబెల్లి నాగమల్లు, గూడెపు పరశురాములు,చుక్క రమేష్, చిరుమర్తి యాదయ్య గుడుకుంట్ల వెంకటేష్, నల్ల స్వామి, కృష్ణయ్య, జి.క్రాంతి కుమార్ పాల్గొన్నారు.
ప్రధాన కార్యదర్శి నాగటి వెంకటేష్
అధ్యక్షుడు బొడ్డు కృష్ణయ్య
ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా కమిటీ ఎన్నిక


