తెలంగాణ సాయుధ పోరాట యోధుడి వందవ బడ్త్ డే
గరిడేపల్లి: గరిడేపల్లి మండల కేంద్రానికి చెందిన మాజీ సర్పంచ్, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, స్వాతంత్య్ర సమరఽయోధుడు బండా పుల్లారెడ్డికి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కుటుంబ సభ్యులు ఆదివారం పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా పూలమాలలతో సత్కరించారు. కార్యక్రమంలో ఆయన భార్య కాంతమ్మ, విజయలక్ష్మి, చంద్రశేఖర్‌రెడ్డి, లలిత, మురళీధర్‌రెడ్డి, ప్రశాంతి, పుల్లమ్మ, చంద్రమ్మ, జానకమ్మ, కోటమ్మ, ధనమ్మ, కృష్ణ, చంద్రమ్మ, రాములయ్య, సీతారామరెడ్డి పాల్గొన్నారు.
చైనా మాంజా విక్రయిస్తున్న ఆరుగురిపై కేసు
సూర్యాపేటటౌన్ : సూర్యాపేటలో చైనా మాంజా విక్రయాలపై ఆదివారం ఎస్‌ఐలు శివతేజ్, మహేందర్‌నాథ్, ఏడుకొండలు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ఈమేరకు ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు పట్టణ ఇన్‌స్పెక్టర్ వెంకటయ్య తెలిపారు. ఎవరైనా చైనా మాంజా విక్రయిస్తే తమ దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు.


