సమాజాభివృద్ధిలో తోడ్పాటు
హాలియా : నూతనంగా ఏర్పడ్డ కుపాసిపల్లి గ్రామపంచాయతీని అనుముల మండలంలోనే ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తా. మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిధిలోని ప్రైవేట్ కళాశాలలో ఎంఏ పొలిటికల్ సైన్స్ విభాగంలో విద్యనభ్యసించాను. బహుజన వాదిగా, విద్యార్థుల సమస్యలపై కొంతకాలంగా పనిచేస్తూ సమాజాభివృద్ధికి తోడ్పాటునందిస్తున్నా. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల్లో భాగంగా సీసీ రోడ్లు, తాగునీరు, డ్రెయినేజీల నిర్మాణం, లైబ్రరీ ఏర్పాటు చేయటమై నా ముందున్న లక్ష్యం. ఐదేళ్ల కాలంలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నిటిని నెరవేర్చి మా గ్రామాన్ని ఉత్తమ పంచాయతీగా అభివృద్ధి చేయడమే నా ముందున్న లక్ష్యం.
– పెరుమాళ్ల వేణుగోపాల్, కుపాసిపల్లి సర్పంచ్


