హామీల అమలే లక్ష్యం
చౌటుప్పల్ : మాది చౌటుప్పల్ మండలం పీపల్‌పహాడ్ గ్రామానికి చెందిన ఉన్నత విద్యావంతురాలు పులనగారి నాగేశ్వరి సర్పంచ్‌గా విజయం సాధించింది. కేవలం 28ఏళ్ల వయస్సున్న ఆమె పోటీ చేసిన తొలిసారే సర్పంచ్ పీఠాన్ని దక్కించుకుంది. వివరాలు ఆమె మాటల్లోనే.. నాకు వివాహం జరిగినప్పటికీ చదువును మాత్రం ఆపలేదు. ఉస్మానియా కళాశాలలో చదువుతూ అక్కడే హాస్టల్‌లో ఉండి ఎంఎస్‌సీ జియో కెమిస్ట్రీ పూర్తి చేశా. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నా. ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను బలోపేతం చేయడమే నా కర్తవ్యం.
– పులనగారి నాగేశ్వరి, పీపల్‌పహాడ్ సర్పంచ్


