రోడ్డుప్రమాదంలో నలుగురికి గాయాలు | - | Sakshi
Sakshi News home page

రోడ్డుప్రమాదంలో నలుగురికి గాయాలు

Jan 12 2026 8:18 AM | Updated on Jan 12 2026 8:18 AM

రోడ్డ

రోడ్డుప్రమాదంలో నలుగురికి గాయాలు

కోదాడరూరల్‌ : రెండు కార్లు పల్టీకొట్టడంతో నలుగురికి స్వల్పగాయాలయ్యాయి. ఈ సంఘటన కోదాడ మండల పరిధిలో నల్లబండగూడెం శివారులో హైదరాబాద్‌– విజయవాడ జాతీయ రహదారిపై పోరస్‌ పరిశ్రమ వద్ద ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాష్ట్ర సరిహద్దు రామాపురం క్రాస్‌రోడ్‌లో ఫ్‌లైఓవర్‌ వంతెన పనులు జరగుతుండటంతో పోరస్‌ పరిశ్రమ నుంచి సర్వీస్‌ రోడ్డు ఏర్పాటు చేశారు. వేగంగా వచ్చిన రెండు కార్లు ఒక్కసారిగా బ్రేకు వేయడంతో పల్టీ కొట్టాయి. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈఘటనపై ఫిర్యాదు అందలేదని రూరల్‌ పోలీసులు తెలిపారు.

మురుగు కాలువలో పడి వ్యక్తి మృతి

త్రిపురారం : మండల కేంద్రం నుంచి బెజ్జికల్‌ గ్రామానికి వెళ్లే దారిలో మురుగు కాలువలో పడి వ్యక్తి మృతి చెందాడు. ఆదివారం త్రిపురారం ఎస్‌ఐ గైకూరి నరేష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్ర రాష్ట్రంలోని చంద్రాపూర్‌ మండలం, జివాటి గ్రామానికి చెందిన నిఖిల్‌ సుదామ్‌ చౌహాన్‌(24) త్రిపురారం మండల కేంద్రంలోని మినార్‌ టీ స్టాల్‌లో పని చేస్తున్నాడు. శనివారం నిఖిల్‌ మహారాష్ట్రకు వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. అతడి వెంట టీ స్టాల్‌లో పని చేస్తున్న నితేష్‌ గుజానంద్‌ రాతోడ్‌ నిఖిల్‌ను బస్సు ఎక్కించాడు. అప్పటికే నిఖిల్‌ తన లగేజీ బ్యాగ్‌ను బెజ్జికల్‌ రోడ్డులోని ఓ వైన్‌ షాపులో మరిచిపోయాడు. కొద్దిదూరం వెళ్లిన తరువాత అతను బస్సు దిగి తన బ్యాగు మరిచిపోయిన వైన్స్‌ షాపు వద్దకు వెళ్లాడు. అప్పటికే రాత్రి కావడంతో మద్యం తాగి ఉన్న నిఖిల్‌ బెజ్జికల్‌ రోడ్డులో మూలమలుపు వద్ద మురుగు కాలువలో పడి మృతిచెందాడు. టీ స్టాల్‌ నిర్వాహకుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

ఉరేసుకొని మహిళ బలవన్మరణం

సూర్యాపేటటౌన్‌ : ఓ మహిళ వ్యక్తిగత కారణాలతో ఫ్యాన్‌కు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బత్తుల వీరబాబు, బత్తుల లక్ష్మి(34) దంపతులు. సూర్యాపేట పట్టణంలోని శ్రీనివాస కాలనీలో నివాసముంటున్నారు. భర్త గత కొంతకాలం క్రితం ఉద్యోగ రీత్యా కెనెడాకు వెళ్లాడు. లక్ష్మి తన ఇద్దరు కుమార్తెలతో ఇక్కడే ఉంటోంది. ఆదివారం ఉదయం 3గంటల సమయంలో లక్ష్మి తన ఇంట్లో సీలింగ్‌ ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుంది. వ్యక్తిగత కారణాలతో తన కుమార్తె ఆత్మహత్య చేసుకున్నట్లు ఆమె తల్లి పార్వతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెంకట్‌ తెలిపారు.

లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

కేతేపల్లి: కేతేపల్లి మండలంలోని కొర్లపహాడ్‌ వద్ద 65 నంబరు జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లోని తిరువూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ప్రయాణికులతో ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్‌ నుంచి తిరువూరుకు బయలుదేరింది. ఈక్రమంలో కేతేపల్లి మండలంలోని కొర్లపహాడ్‌ బస్‌స్టేజీ వద్దకు చేరుకోగానే ముందు వెళ్తున్న లారీ డ్రైవర్‌ ఒక్కసారిగా బ్రేక్‌ వేయడంతో బస్సు లారీని వెనుక వైపు నుంచి ఢీకొట్టింది. ఈప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న రామకృష్ణారావు, నర్సింహారావు తీవ్రంగా గాయపడగా మరో నలుగురు ప్రయాణికులకు స్వల్పంగా గాయాలయ్యాయి. క్షతగాత్రులకు 108 అంబులెన్స్‌ సిబ్బంది ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం నకిరేకల్‌ ఏరియా ఆస్పత్రికి తరలించారు.

రోడ్డుప్రమాదంలో  నలుగురికి గాయాలు1
1/1

రోడ్డుప్రమాదంలో నలుగురికి గాయాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement