పల్లెపాలనలో యువ తరంగాలు
ఫ సర్పంచ్‌గా ఎన్నికై గ్రామాభివృద్ధిలో పాలుపంచుకుంటున్న యువత ఫ ఇచ్చిన హామీలపై దృష్టి
ఫ ప్రణాళికలు రూపొందించుకుని పక్కాగా అమలు
చేస్తామంటున్న నవయువ సర్పంచ్‌లు
నేడు జాతీయ యువజన దినోత్సవం
కొండమల్లేపల్లి : ఎంఏ, బీఈడీ పూర్తి చేసిన నేను 26 ఏళ్ల వయసులోనే ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ఇటీవల జరిగిన కొండమల్లేపల్లి మండలం గుర్రపుతండా పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందాను. డెత్ సర్టిఫికెట్లు తీయడం, కులం, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు ఇప్పించడం వితంతు పెన్షన్లు ఇప్పించడంతో తమ తండాలో ఆడ బిడ్డ పుడితే రూ.1,016, అమ్మాయి వివాహానికి కల్యాణ కానుకగా రూ.2,016 ఇస్తాను. చదువుకున్న యువత రాజకీయాల్లోకి వస్తేనే దేశ అభివృద్ధి సాధ్యమవుతుంది. – రమావత్ సేవానాయక్, గుర్రపుతండా సర్పంచ్
ప్రజా సేవ చేయాలనే సంకల్పంతో యువత ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. ఇంజనీరింగ్, సాంకేతిక విద్యతోపాటు, ఇతర ఉద్యోగాలు చేస్తున్న వారు సైతం సర్పంచ్ పీఠాన్ని దక్కించుకుని గ్రామాభివృద్ధిలో పాలు పంచుకుంటున్నారు. సోమవారం వివేకానంద జయంతిని పురస్కరించుకుని జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా యువ సర్పంచ్‌లు గ్రామాభివృద్ధికి రూపొందించుకున్న ప్రణాళికలు, వాటి అమలుకు తీసుకుబోయే కార్యాచరణ వారి మాటల్లోనే..


