● వ్యవసాయం, ఉపాధి రంగాల్లో రాణిస్తున్న యువత ● నచ్చిన పన
యువతా మేలుకో.. నిద్ర నుంచి మేల్కొని గమ్యం చేరే వరకు విశ్రమించకు అనే స్వామి వివేకానంద సూక్తిని నిజం చేస్తూ యువత ముందుకు సాగుతోంది. వ్యవసాయ రంగాల్లో, కుల వృత్తుల్లో నైపుణ్యం ప్రదర్శిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. విభిన్న రంగాల్లో విజయం సాధించిన వారిపై ప్రత్యేక కథనాలు.
హుజూర్‌నగర్ : మండలంలోని అంజలీపురం గ్రామానికి చెందిన గొర్రె అశోక్ దేశవ్యాప్తంగా అత్యంత ప్రభావవంతమైన యువ సృష్టికర్తగా గుర్తింపు పొందారు. ఫోర్బ్స్ ఇండియా అవార్డ్స్ సీజన్–2లో టెక్ లీడ్ సోషల్ ఇన్నోవేషన్ విభాగంలో ఎంపికై గత నెలలో జాతీయ అవార్డు అందుకున్నాడు. డిస్టెన్స్‌లో డిగ్రీ పూర్తిచేసి ప్రస్తుతం ఎంబీఏ చదువుతున్నాడు. తల్లిదండ్రులు వ్యవసాయదారులు కావడంతో వారికి చేదోడు వాదోడుగా ఉండాలని చిన్నతనం నుంచే భావించాడు. అందులో భాగంగా వ్యవసాయ పరికరాల తయారీపై దృష్టి సారించి పత్తి, మిరప పంటల్లో విత్తనాలు వేసే యంత్రం, కలుపు తీసే యంత్రం, పురుగుల మందు పిచికారీ యంత్రాలను రూపొందించాడు. ఆతర్వాత రూరల్ రైజ్ అగ్రినరీ అనే స్టార్టప్ కంపెనీ ప్రారంభించాడు. పరికరాలను తయారు చేసి తక్కువ ధరలో రైతులకు అందుబాటులోకి తెచ్చాడు.. ఈనేపథ్యంలో అతని ప్రతిభను గుర్తించిన ఫోర్బ్స్ ఇండియా ఇటీవల అశోక్‌ను జాతీయ స్థాయి అవార్డుతో సత్కరించింది.


