యాదగిరీశుడి క్షేత్రంలో భక్తుల రద్దీ
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారంతో పాటు పాఠశాలలకు సంక్రాంతి సెలవులు రావడంతో వివిధ ప్రాంతాల నుంచి తమ సొంత గ్రామానికి వెళ్లే వారు యాదగిరీశుడిని దర్శించుకునేందుకు తరలివచ్చారు. ఆలయ పరిసరాలు, క్యూలైన్లు, క్యూకాంప్లెక్స్, ముఖ మండపం క్యూలైన్, ప్రసాద విక్రయశాల వంటి ప్రాంతాల్లో భక్తుల రద్దీ కనిపించింది. శ్రీస్వామి వారి ధర్మ దర్శనానికి 3గంటల సమయం, వీఐపీ దర్శనానికి గంట సమయం పట్టింది. శ్రీస్వామివారిని 35వేలమందికి పైగా భక్తులు దర్శించుకోగా.. నిత్యాదాయం రూ.39,22,539 వచ్చినట్లు ఆలయాధికారులు వెల్లడించారు.
ఆలయ ముఖ మండపంలో క్యూలైన్‌లో ఉన్న భక్తులు


