ఉద్యోగం వదిలి ఉపాధి కల్పించే స్థాయికి..
భూదాన్‌పోచంపల్లి: భూదాన్‌పోచంపల్లి పట్టణ కేంద్రంలోని చేనేత కుటుంబానికి చెందిన సాయిని భరత్(33) ఎంటెక్ పూర్తి చేసి ఆరేళ్లపాటు ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశాడు. తన తల్లిదండ్రులు చేస్తున్న కులవృత్తిని పదికాలాల పాటు సజీవంగా ఉంచాలని ఉద్యోగానికి గుడ్‌బై చెప్పి చేనేత వృత్తిని ఎంచుకున్నాడు. కేంద్ర ప్రభుత్వ చిన్న, లఘు, మధ్యతరహా పరిశ్రమల శాఖ సహకారంతో రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా కళా పునర్వి పేరిట హ్యాండ్లూమ్ నెలకొల్పి 80 మందికి ఉపాధి కల్పిస్తున్నాడు.
ఎన్నో అవార్డులు సొంతం
– 2022లో చేనేతలో నూతన ఆవిష్కరణలు, ఉపాధి కల్పనకు గాను బెస్ట్ ఫర్మామెన్స్ అవార్డు అందుకున్నాడు.
– 2018లో చేనేతలో డిజైనింగ్‌లో నేషనల్ మెరిట్ సర్టిఫికెట్ అందుకున్నాడు
– 2018లో ఆచార్య కొండా లక్ష్మణ్‌బాపూజీ రాష్ట్ర స్థాయి అవార్డు
– 2014లో చిన్న మగ్గంపై జాతయ నాయకుల కళాఖండాలను రూపొందించినందుకు లిమ్కా బుక్ రికార్డు, వండర్ బుక్ ఆఫ్ రికార్డు, తెలుగు బుక్ ఆఫ్ రికార్డు, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డులను సొంతం చేసుకున్నాడు.


