రేషన్ కార్డు ఉంటే.. ఆదాయ సర్టిఫికెట్ అవసరం లేదు
ఫ భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డి
భువనగిరిటౌన్ : రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తెల్ల రేషన్ కార్డు కలిగి ఉంటే ఆదాయ ధ్రువీకరణ పత్రం అవసరం లేదని భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డి వెల్లడించారు. బుధవారం తన చాంబర్లో మీసేవ కేంద్రాల నిర్వాహకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెల్లరేషన్ కార్డు లేనివారు ఆదాయ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. అలాగే 2014 తర్వాత మీసేవ కేంద్రాల నుంచి కుల ధ్రువీకరణ పత్రం తీసుకుంటే కొత్తగా అవసరం లేదన్నారు. ఈ విషయాలను అభ్యర్థులకు మీ సేవ నిర్వాహకులు వెల్లడించాలని ఆదేశించారు.


