మత్స్య సంపదకు ఏమైంది? | - | Sakshi
Sakshi News home page

మత్స్య సంపదకు ఏమైంది?

Oct 17 2026 8:24 AM | Updated on Oct 17 2026 8:24 AM

మత్స్య సంపదకు ఏమైంది?

నరసాపురం రూరల్‌: వశిష్ట గోదావరిలో గత నాలుగు రోజులుగా టన్నుల కొద్దీ మత్స్యసంపద మృత్యువాతపడి తేలియాడుతుండటంతో స్థానిక మత్స్యకారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నరసాపురం పరిసర ప్రాంతాల్లోని ఆక్వా ప్రాసెసింగ్‌ యూనిట్ల నుంచి నిబంధనలకు విరుద్ధంగా రసాయన వ్యర్థాలను నేరుగా నదిలోకి వదలడమే ఇందుకు కారణమని ఆరోపిస్తున్నారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగినా అధికారులు కంటితుడుపు చర్యలకే పరిమితమయ్యారని వాపోతున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ స్పందించి వశిష్ఠ గోదావరిని కలుషితం చేస్తున్న ప్రాసెసింగ్‌ యూనిట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని మత్స్యకారులు కోరుతున్నారు. అయితే శుక్రవారం ప్రభుత్వ విప్‌, స్థానిక ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్‌, అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ కొల్లు పెద్దిరాజు, మత్స్య సహకార సంఘాల జిల్లా అధ్యక్షుడు మైలా వసంతరావు పడవలో ప్రయాణించి పరిస్థితిని పరిశీలించారు. బాధితులను ప్రభుత్వపరంగా ఆదుకుంటామని వారు హామీ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement