కొయ్యలగూడెంలో భగ్గుమన్న టీడీపీ వర్గపోరు | - | Sakshi
Sakshi News home page

కొయ్యలగూడెంలో భగ్గుమన్న టీడీపీ వర్గపోరు

Oct 17 2026 8:24 AM | Updated on Oct 17 2026 8:24 AM

కొయ్యలగూడెంలో భగ్గుమన్న టీడీపీ వర్గపోరు

కొయ్యలగూడెం: కొయ్యలగూడెంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో శుక్రవారం నిర్వహించిన పోలవరం నియోజకవర్గ టీడీపీ సదస్సు వర్గపోరుకు వేదికై ంది. అబ్జర్వర్‌ కోళ్ల నాగేశ్వరరావు, ట్రైకార్‌ చైర్మన్‌ బొరగం శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించారు. కష్టపడినవారిని కాదని ప్రాధాన్యత లేనివారికే పెద్దపీట వేస్తున్నారంటూ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వేదికపైకి దూసుకెళ్లారు. సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీలో నాయకులు పక్షపాతం ప్రదర్శించారని, బయ్యనగూడెం నేతకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారంటూ నిరసన తెలిపారు. అర్హులైన వారికే పదవులు ఇవ్వాలని నినాదాలు చేశారు. అందరి అభిప్రాయాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లిన తరువాతే ఎంపీపీ, జెడ్పీటీసీ అభ్యర్థులపై నిర్ణయం తీసుకుంటామని పరిశీలకులు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. కాగా, పార్టీ శ్రేణుల మధ్య జరిగిన వాగ్వాదాన్ని కవర్‌ చేస్తున్న ఒక మీడియా ఛానెల్‌ జర్నలిస్టుపై కొందరు వ్యక్తులు దూసుకెళ్లి ఘర్షణకు పాల్పడ్డారు. అతని కవరేజ్‌ సామాగ్రిని లాక్కోవడానికి యత్నించడం వివాదాస్పదమైంది. అక్కడే ఉన్న మాజీ ఏఎంసీ చైర్మన్‌ పారేపల్లి రామారావు జోక్యం చేసుకుని వివాహాన్ని సర్దుబాటు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement