రాజ్యాంగాన్ని న్యాయవాదులు పరిరక్షించాలి | - | Sakshi
Sakshi News home page

రాజ్యాంగాన్ని న్యాయవాదులు పరిరక్షించాలి

Sep 27 2026 1:34 AM | Updated on Sep 27 2026 1:34 AM

భీమవరం: రాజ్యాంగాన్ని పరిరక్షించవలసిన బాధ్యత న్యాయవాదులపై ఎంతైనా ఉందని ఏపీ బార్‌ కౌన్సిల్‌ సభ్యుడు సుంకర రాజేంద్రప్రసాద్‌ అన్నారు. భీమవరంలో శనివారం దిగుపాటి రాజగోపాల్‌ అధ్యక్షతన జరిగిన ఆలిండియా లాయర్స్‌ యూనియన్‌ 11వ జిల్లా మహాసభలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. భారత రాజ్యాంగం కల్పించిన పౌర హక్కులను నేటి పాలకులు హరించివేస్తున్నారని, కనీసం ప్రశ్నించే హక్కు కూడా లేకుండా పోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయవాది వృత్తి ప్రశ్నలతోనే ప్రారంభమవుతుందని, అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ న్యాయవాదులు రాజ్యాంగాన్ని, ప్రజలను పాలకుల నుంచి కాపాడాలని పిలుపునిచ్చారు. యువ న్యాయవాదులు తీర్పులను క్షుణ్ణంగా చదవాలని, ప్రజల పక్షాన నిలబడి ప్రజా సమస్యలపై పోరాడేందుకు ముందుకు రావాలని కోరారు. న్యాయవాదులు కేవలం వృత్తికే పరిమితం కాకుండా, ప్రజా జీవితంలో భాగం కావాలని ఆలిండియా లాయర్స్‌ యూనియన్‌ ఆకాంక్షించారు. ఈ మహాసభలో బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వై. న్యూటన్‌, బడుగు అశోక్‌ బాబు, పాముల చిట్టిబాబు, కొవ్వూరి అప్పిరెడ్డి, శ్రీరామ్‌ మూర్తి, రామాని కాస్ట్రో, కామన మునిస్వామి, పుట్టా వేణుగోపాలచౌదరి, కట్టా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement