ముంచిన నీటి నిర్లక్ష్యం
చేపల, రొయ్యల చెరువుల్లోని నీరు పంట కాల్వలోకి చేరడంతో తాగునీరు కలుషితమవుతోంది. రహదారిపైకి చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. 8లో u
కలెక్టర్ చదలవాడ నాగరాణి
భీమవరం (ప్రకాశంచౌక్): ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు మరింత బాధ్యతతో వ్యవహరించి, పీజీఆర్‌ఎస్ రెవెన్యూ క్లినిక్‌లలో అందిన అర్జీలను నిర్ణీత గడువులోపు నాణ్యమైన విధంగా పరిష్కరించాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు. సోమవారం భీమవరం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ చదలవాడ నాగరాణి, జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, జిల్లా స్వర్ణ గ్రామం – స్వర్ణ వార్డు అధికారి వై.దోసిరెడ్డి, డ్వామా పీడీ డా.కె.సి.హెచ్.అప్పారావు, కలెక్టరేట్ పరిపాలనాధికారి ఎన్.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొని జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, 133 అర్జీలు స్వీకరించినట్లు తెలిపారు. పాలకోడేరు నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు తరలి వచ్చి కలెక్టరేట్ వద్ద తమ ఇళ్ల తొలగింపునకు మార్కింగ్ చేస్తున్నారని నిరసన తెలియచేసి పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్‌ను కలిసి న్యాయం చేయాలని కోరారు. ఆకివీడు మండలంలో డ్వాక్రా సొమ్ములు కాజేసిన ఇద్దరు మెప్మా ఆర్పీలు, వారికి సహకరించిన బ్యాంకు అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆ మండలానికి చెందిన పలువురు డ్వాక్రా మహిళలు, బాధితులు పీజీఆర్‌ఎస్‌లో వినతిపత్రం అందచేశారు.


