అదుపు తప్పి కారు బోల్తా | - | Sakshi
Sakshi News home page

అదుపు తప్పి కారు బోల్తా

Apr 21 2026 6:19 AM | Updated on Apr 21 2026 6:19 AM

అదుపు తప్పి కారు బోల్తా

దెందులూరు: అదుపు తప్పి కారు బోల్తా పడిన ఘటనలో విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన 16వ నంబర్‌ జాతీయ రహదారిపై సోమవారం చోటుచేసుకుంది. ఆగిరిపల్లికి చెందిన ప్రైవేట్‌ కళాశాల విద్యార్థులు 8 మంది ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి కారులో వెళుతున్నారు. దెందులూరు వద్ద కారు అదుపుతప్పి గుండేరు గట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న విద్యార్థులు స్వల్ప గాయాలతో బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. క్షతగాత్రులను వైద్య చికిత్స నిమిత్తం ఏలూరు వైద్యశాలకు తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement