శ్రీవారి క్షేత్రంలో తోటమాలి నిజాయతీ | - | Sakshi
Sakshi News home page

శ్రీవారి క్షేత్రంలో తోటమాలి నిజాయతీ

Apr 21 2026 6:19 AM | Updated on Apr 21 2026 6:19 AM

ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రంలో ఓ తోటమాలి నిజాయతీ కారణంగా ఒక మహిళ పోగొట్టుకున్న పర్సు తిరిగి ఆమెకు దక్కింది. వివరాల ప్రకారం. డీఆర్‌డీఏలో పనిచేస్తున్న ద్వారకాతిరుమల మండలం దొరసానిపాడు గ్రామానికి చెందిన నాగలక్ష్మి సోమవారం కొండపైన సీతా నిలయంలో ఉన్న అధికారులను కలిసేందుకు వెళ్లిన సమయంలో పర్సు పొగొట్టుకున్నారు. ఆ పర్సులో రూ.5 లక్షల విలువైన నాలుగు కాసుల బంగారు గొలుసు, కొంత నగదు ఉంది. అక్కడ గార్డెన్‌లో పనిచేస్తున్న తోటమాలి సీతయ్యకు ఆ పర్సు దొరకగా దేవస్థానం ఎలక్ట్రికల్‌ డీఈ టి.సూర్యనారాయణకు అందజేశాడు. ఈ విషయాన్ని ఆయన మైక్‌ ద్వారా చెప్పడంతో నాగలక్ష్మి సూర్యనారాయణను సంప్రదించగా, ఆ పర్సును తోటమాలి సీతయ్య చేతుల మీదుగా ఆమెకు అప్పగించారు. ఈ సందర్భంగా సీతయ్య నిజాయతీని పలువురు అభినందించారు.

పోగొట్టుకున్న పర్సును మహిళకు అప్పగింత

Advertisement
 
Advertisement
Advertisement