చింతలపూడి: పార్టీ కోసం అంకితభావంతో, కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు, నాయకుడికి భవిష్యత్తులో సముచిత స్థానం లభిస్తుందని శా సనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు అ న్నారు. ఆదివారం చింతలపూడి పర్యటనలో భాగంగా వైఎస్సార్‌సీపీ మున్సిపల్ విభాగం ఏలూరు జిల్లా అధ్యక్షుడు బొడ్డు వెంకటేశ్వరరావు నివాసానికి విచ్చేశారు. పార్టీ పట్టణ నాయకులు ఆయన్ను మర్యాదపూర్వకంగా క లుసుకున్నారు. మోషేన్‌రాజు మాట్లాడుతూ పార్టీ అభివృద్ధి కోసం క్షేత్రస్థాయిలో కష్టపడే వారిని పార్టీ ఎల్లప్పుడూ గుర్తిస్తుందన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కార్యకర్తలు, నాయకులు అధైర్యపడకుండా ఐ క్యమత్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో పార్టీకి తిరిగి మంచి రోజులు వ స్తాయని అన్నారు. జిల్లా ప్రచార విభాగం అధ్యక్షుడు త్సల్లాబత్తుల శ్రీనివాసరావు, నాయకులు సీహెచ్ జానారెడ్డి, కొప్పుల నాగేశ్వరరావు, కనుమ రెడ్డి చండీప్రియ, ఎం. దుర్గారావు, డోకల రాము తదితరులు ఉన్నారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): పూర్వ పశ్చిమగోదావరి జిల్లాలోని జెడ్పీ, మండల పరిషత్, మున్సిపాలిటీలు–మున్సిపల్ కార్పొరేషన్ల కింద పనిచేస్తున్న ఉపాధ్యాయుల సాధారణ సీనియార్టీ జాబిత రూపొందించి మూడు విడతల్లో అభ్యంతరాలు తీసుకుని సరిచేశామని ఏలూరు డీఈఓ ఎం.వెంకట లక్ష్మమ్మ ఓ ప్రకటనలో తెలిపారు. సాధారణ సీనియార్టీ, సబ్జెక్టు వారీగా సీనియార్టీ జాబితాలు సంబంధిత పూర్వ పశ్చిమగోదావరి జిల్లా, పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్‌లో, నోటీసు బోర్డుల్లో సోమవారం నుంచి అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ఏ మైనా అభ్యంతరాలు ఉంటే 25వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు సంబంధిత డీవైఈఓ, ఎంఈఓల ద్వారా పూర్వ పశ్చిమగోదావరి జిల్లా వి ద్యాశాఖ కార్యాలయం, ఏలూరులో సమర్పించాలని సూచించారు. గడువు తర్వాత వచ్చిన వినతులు స్వీకరించబోమని, ఇదే చివరి అవకాశంగా భావించాలని డీఈఓ తెలిపారు.
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చినవెంకన్న క్షేత్రంలో జరిగిన రూ.200 నకిలీ దర్శనం టికెట్ల స్కామ్ కేసులోని నిందితులకు కోర్టు ఇచ్చిన రెండు రోజుల పోలీస్ కస్టడీ ఆదివారంతో ముగిసింది. భీమడోలు స్టేషన్‌లో సీఐ పి.కృష్ణ ఐదుగురు నిందితులను విచారించి స్టేట్‌మెంట్లు రికార్డ్ చేశారు. ఆదివారం సాయంత్రం వారి ని భీమడోలు కోర్టు న్యాయమూర్తి ఎస్.ప్రియదర్శిని నూతక్కి ముందు హాజరుపరిచారు. అనంతరం రిమాండ్‌కు తరలించారు. కేసుకు సంబంధించి తొమ్మిది మంది నిందితుల్లో ఐఎస్‌జే రాజు, ఎం.రమేష్, ఎస్.శేషుబాబు, ఎం.సతీష్, టి.సత్యనారాయణను పోలీసులు కస్టడీకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా కస్టడీకి సంబంధించిన అంశాలు, కేసు పురోగతి తదితర అంశాలపై క్షేత్రంలో చర్చ జరుగుతోంది. అలాగే 2025 జనవరి 1 నుంచి శ్రీవారి ఆల యంలో రూ.100, రూ.200 టికెట్ కౌంటర్లలో పనిచేసిన సిబ్బంది వివరాలను తెలపాలని పో లీసులు ఆదివారం దేవస్థానానికి లేఖ రాశారు. దీనిని బట్టి చూస్తే విచారణ ఇంకా కొనసాగుతున్నట్టు స్పష్టమవుతోంది.
సాఫ్ట్‌వేర్ సంగతేంటి..
కేసులో ఎ–9 నిందితుడిగా ఉన్న సాఫ్ట్‌వేర్ ఉ ద్యోగి డేటాబేస్ లేకుండా కేవలం టికెట్ ప్రింట్ వచ్చేలా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించాడు. అయితే తన స్నేహితుడు రమేష్ అడగడం వల్ల దేవస్థానానికి అనుకుని సాఫ్ట్‌వేర్ తయారు చేశానని పోలీసులకు స్టేట్‌మెంట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఉన్నతాధికారుల ఆథరైజేషన్ లేకుండా సాఫ్ట్‌వేర్ ఎలా తయారుచేస్తారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఉన్నతాధికారులు మరింత దృష్టి సారించా లని భక్తులు కోరుతున్నారు.
ఉంగుటూరు: బాదంపూడిలోని మత్స్య శిక్షణా కేంద్రం (మంచినీటి చేపల కేంద్రం)లో మూ డు నెలల శిక్షణ కోర్సుకు ధరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మత్స్యశాఖ అధికారి బి.రాజకుమార్ ప్రకటనలో తెలిపారు. ఈనెల 23లోపు దరఖాస్తు చేసుకోవాలని, 28న ముఖాముఖీగా అభ్యర్థులను ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. వచ్చేనెల 1 నుంచి జూలై 31 వరకు శిక్షణ ఇ స్తామన్నారు. చేపల పెంపకంలో మెలకువలు, సాగుపై అవగాహన, వ్యాధులు, నివారణ, చేప నారు ఉత్పత్తి వంటి అంశాలపై శిక్షణ ఇస్తామన్నారు. ఐదో తరగతి చదివి 18 నుంచి 30 ఏళ్ల వయసున్న యువత అర్హులన్నారు. శిక్షణ అనంతరం సర్టిఫికెట్లు ప్రదానం చేస్తామని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు సెల్ 95733 37484, 7286993033, 9492337649 నంబర్లలో సంప్రదించాలని కోరారు.


